స్వలింగ సంపర్కుల పెళ్లికి ఓకే..
డబ్లిన్: ఇకపై స్వలింగ సంపర్కులు ఐర్లాండ్లో స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చు. అందరిలాగే జీవితం గడపవచ్చు. ఆ మేరకు ‘వివాహ బిల్లు 2015’లో మార్పులు చేస్తూ శుక్రవారం అధ్యక్ష కమిషన్ చట్టం తీసుకొచ్చింది. సంప్రదాయ క్యాథలిక్ దేశమైన ఐర్లాండ్లో ఈ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా 62.1 శాతం ప్రజలు గేలకు మద్దతు ప్రకటించారు.
ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను సంబంధిత అధికారులు గురువారం వెల్లడించారు. గేలకు మద్దతుగా చట్టం తీసుకొచ్చిన మొదటి దేశంగా ఐర్లాండ్ నిలిచింది. రానున్న నెల రోజుల్లో ఈ తరహా వివాహాలను కొన్నైనా జరిపించాలని కూడా నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు.