'హెలెన్'ను మార్స్ అర్బిటర్ చిత్రీకరించింది'
ఆంధ్ర ప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతున్న హెలెన్ తుఫాన్ కు సంబంధించిన చిత్రాలను భారత మార్స్ ఆర్బిటర్ పంపింది. మన దేశానికి సంబంధించిన చిత్రాలను మార్స్ అర్బిటెర్ మొదటి సారిగా చిత్రీకరించి పంపిందని ఇస్రో అధికారులు వెల్లడించారు.
మొదటి విడుతగా భూమండలానికి సంబంధించిన చిత్రాలను ముఖ్యంగా భారత ఉపఖండం, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల చిత్రాను 'మంగళయాన్' పంపించిందని ఇస్రో ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్ర తీర ప్రాంతాన్ని కుదిపేస్తున్న హెలెన్ తుఫాన్ కు సంబంధించిన ఫోటోలను మంగళవారం చిత్రీకరించిందని అధికారులు తెలిపారు.
స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న పరికరాలను పరిశీలిస్తున్నాం అని అన్నారు. మార్స్ అర్బిటర్ లో అమర్చిన మార్స్ కలర్ కెమెరా ద్వారా మంగళవారం మధ్యాహ్నం 1.50 నిమిషాలకు 67975 కిలోమీటర్ల దూరంలో 3.53 కి.మి రిజల్యూషన్ తో చిత్రీకరించింది అని ఇస్రో తెలిపింది. అధికారికంగా ఒకే ఒక ఫోటోను ఇస్రో వెబ్ సైట్లో పెట్టారు.
Photo courtesy: http://www.isro.org/pslv-c25/Imagegallery/mom-images.aspx