
మామ్ ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనలో చారిత్రకఘట్టం ఘట్టం చోటు చేసుకుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతంగా అరుణగ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో బెంగళూరులోని ఇస్ట్రాక్ ప్రాంగణంలో శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. మామ్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల మోడీ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలకు మోడీ అభినందనలు తెలిపారు. మొదటి ప్రయత్నంలోనే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన దేశాల జాబితాలో భారత్ నాలుగో దేశంగా నిలిచింది.