క్వార్టర్స్‌లో సానియా-హింగిస్ జోడి
మెల్బోర్న్: మహిళల డబుల్స్ విభాగంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా మీర్జా- మార్టీనా హింగిస్(స్వీజ్జర్లాండ్)ల జోడి.. ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఈ టాప్‌సీడ్ జోడీ.. స్వెత్లానా కుజ్నెత్సోవా(రష్యా)-రాబర్టా విన్సీ(ఇటలీ) జంటపై 6-1, 6-3 పాయింట్లతో వరుస సెట్లలో విజయం సాధించింది. 80 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సానియా ద్వయం చెలరేగిపోయి క్వార్టర్స్ లోకి ప్రవేశించింది.