maruva vanka
-
జీవన సిత్రం.!
ఈ చిత్రాన్ని చూస్తే ‘శ్రమ జీవుల స్వేదానికి ఖరీదు కట్టే షరాబులు లేరు’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు గుర్తుకు వస్తున్నాయి కదూ? ఔను! మన ఇంటి ఎదుట కొద్ది పాటి రోత ఉంటే కాలు కూడా పెట్టలేం. దుర్వాసన వస్తే భరించలేం. మరీ మలమూత్రాలు కలగలసిన మురుగు కాలువను ఈ కష్టజీవులు నిండా మునిగి శుభ్రం చేశారు. వీరి శ్రమను చూసిన వారు ముక్కన వేలేసుకున్నారు. అనంతపురం నడిబొడ్డున ఉన్న మరువ వంకను వట్టి చేతులతోనే గురువారం వీరు శుభ్రం చేయడానికి పూనుకున్నారు. ఓ వైపు భరించలేని దుర్వాసన.. మరో వైపు పురుగుపుట్ర సంచారం వారిని ఇబ్బంది పెడుతున్నా... పగిలిన గాజు పెంకులు గుచ్చుకుంటున్నా... ఒట్టి కాళ్లతో కాలువలో దిగి చేతులతో వ్యర్థాలను తొలగించారు. - వీరేష్, సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
మరువవంక పూడికతీత పనులు ప్రారంభం
అనంతపురం న్యూసిటీ : ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పర్యవేక్షణలో మరువవంక పూడికతీత పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. నగరంలోని మరువకొమ్మ కాలనీ, సంగమేశ్వర థియేటర్ తదితర ప్రాంతాల్లో 12 ఇటాచీలతో పూడికను తొలగించారు. నగరపాలక సంస్థ, ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖల నుంచి అధికారులను తీసుకువచ్చి వారి సూచనలతో పనులు చేయించారు. పాలకులు పట్టించుకోవడం లేదు పారిశుద్ధ్యం మెరుగుకు పాలకులు పట్టించుకోవడం లేదని, అందుకే పూడికతీత పనులు తానే స్వయంగా చేయించాల్సి వచ్చిందని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. మరువవంకకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళికలు పంపామన్నారు.