Massachusetts researchers
-
శుభవార్త ;అందుబాటులోకి యాంటీబయాటిక్
ఇటీవల చాలాకాలం నుంచి మనకు సరికొత్త యాంటీబయాటిక్స్ ఏవీ లభ్యం కాకపోవడం మానవాళిని ఆందోళనలో ముంచెత్తుతోంది. అలాంటి దుస్థితిని తొలగించేందుకు ‘మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’(ఎమ్ఐటీ) పరిశోధకులు నడుంకట్టారు. అక్కడి ఫలితాలూ ఆశాజనకంగానూ ఉన్నాయి. అతి త్వరలోనే మానవాళికి ‘హాలిసిన్’ పేరుతో ఓ సరికొత్త యాంటీబయాటిక్ లభ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు అక్కడి పరిశోధనల ద్వారా తెలుస్తోంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు కూడా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉండటం మన అలవాటు. ఆన్ కౌంటర్ మెడిసిన్స్‌గా అమ్ముడయ్యే వాటిల్లో యాంటీబయాటిక్సే ఎక్కువ. దాంతో గతంలో చిన్న యాంటీబయాటిక్ వేస్తే తగ్గిపోయే వ్యాధులు కూడా మొండికేయడం మొదలుపెట్టాయి. మనం తేలిగ్గా తుదముట్టించగల వ్యాధిక్రిములూ తమ శక్తిని విపరీతంగా పెంచుకుంటూ పోయి‘ సూపర్‌బగ్స్’గా మారిపోతూ మానవాళిని బెంబేలెత్తించాయి. ఒకప్పుడు యాంటీబయాటిక్స్‌కు తేలిగ్గానే లొంగిపోయే ట్యూబర్క్యులోసిస్ (టీబీ) వంటి వ్యాధులు కలిగించే సూక్ష్మజీవులు... తమ నిరోధకశక్తిని పెంచుకొని రెసిస్టెంట్ వెరైటీ టీబీని కలిగిస్తూ సూపర్‌బగ్స్‌గా రూపొందాయి. దాంతో ప్రస్తుతం లభ్యమవుతున్న యాంటీబయాటిక్ మందులను డబుల్‌డోస్ ఇచ్చినా ఆ సూపర్‌బగ్స్‌ను నిర్మూలించలేకపోతున్నాం. ఇలాంటి దుస్ధితి వల్ల మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు వస్తాయేమోనని అటు వైజ్ఞానికులూ, ఇటు వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో అలాంటి సూపర్‌బగ్స్‌ను తుదముట్టించే యాంటీబయాటిక్‌కు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఓ భరోసా లభించింది. హాలిసిన్ అనే పేరుతో రాబోతున్న ఈ సరికొత్త యాంటీబయాటిక్ ఔషధం కోసం ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తోందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. -
రొమ్ము పాలతో బ్రెస్ట్ కేన్సర్ గుర్తింపు
బోస్టన్: రొమ్ము పాలలోని ప్రొటీన్ల తీరును బట్టి బ్రెస్ట్ కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించవచ్చని తేలింది. యుక్త వయసులోని మహిళల్లో రొమ్ము కేన్సర్‌ను గుర్తించడంలో ఇప్పుడున్న మామోగ్రఫీ, ఇమేజింగ్ పద్ధతులు అంత ప్రభావవంతమైనవి కావని, యుక్త వయసులోని మహిళల్లో రొమ్ము కణజాలాలు అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని పరిశోధకులు పేర్కొన్నారు. రొమ్ము పాలు, కన్నీళ్లు, మూత్రం, లాలాజలం, సీరం వంటి ద్రవాల్లోని ప్రొటీన్ల తీరులను పర్యవేక్షించడం ద్వారా బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించవచ్చని మసాచూసెట్స్ వర్సిటీ పరిశోధకులు వివరించారు. పరిశోధనలో భాగంగా రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న మహిళలు, రొమ్ము కేన్సర్ లేని మహిళల పాలను పోల్చి చూశారు. రొమ్ము కేన్సర్ వ్యాధికి కారణంగా భావించే ఎపిథియల్ కణాలను పరీక్షించేందుకు రొమ్ము పాలు ఉపయోగపడతాయని వెల్లడించారు.