కాళోజీ, జయశంకర్ కలలు సాకారం చేద్దాం
రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోర ణానికి చోటుదక్కడం జిల్లాకు గర్వకారణం
అభివృద్ధిలో అందరి సహకారం అవసరం
కీర్తి స్థూపం మన బాధ్యతను పెంచింది
అవతరణ వేడుకల్లో కలెక్టర్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : స్వరాష్ట్ర ఏర్పాటు.. అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి అమరులైన ప్రజాకవి కాళోజీ నారాయణరావు, ఆచా ర్య కొత్తపల్లి జయశంకర్‌ల ఆశయాలు సాధించేందుకు ప్రతిఒక్కరూ అంకిత భా వంతో కృషిచేయాలని కలెక్టర్ జి.కిషన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 36 లక్షల మంది ప్రజలకు రాష్ట్ర ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధికారిక ముద్రలో కాకతీయుల కళాతోరణంకు చోటుదక్కడం అందరికీ గర్వకారణమన్నారు.
ఓరుగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించిన కీర్తి స్థూపం మనపై మరింత భారం పెంచిందని కలెక్టర్ గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించా రు. అంద్శైరాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. సభికులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
సమరయోధులకు సన్మానం..
ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమర యోధులను శాలువాలతో కలెక్టర్ సన్మానించారు. ఇటీవల టెన్త్‌లో పదికి పది జీపీఎస్ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కలెక్టర్ ప్రశంస పత్రాలు అంద జేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమలు ఆహుతులను అలరించాయి.
నూతన రాష్ట్ర ప్రచార సాహిత్యాన్ని వేదికపై కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ పౌసుమి బసు, కమిషనర్ సువర్ణపాండాదాస్, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, ఏజేసీ కృష్ణారెడ్డి, డీఆర్వో సురేందర్‌కరణ్, సమాచార శాఖ డీడీ బాలగంగాధర్‌తిలక్, ఇతర ఉన్నతాధికారులు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వల్సపైడి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.