‘సాక్షి’ మ్యాథ్స్ ‘బీ’లో మాంటిస్సోరి విద్యార్థి ప్రతిభ
కర్నూలు(అర్బన్): సాక్షి దినపత్రిక ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మ్యాథ్స్ బీ టాలెంట్ సెర్చ్ పరీక్షలో మాంటిస్సోరి బాలుర క్యాంపస్ 10వ తరగతి విద్యార్థి సీ. మస్తానయ్య రాష్ట్రస్థాయి మూడో ర్యాంక్ సాధించాడు. ఈ నెల 23న జరిగిన ఫైనల్ పరీక్షలోవిద్యార్థి చాటడంతో సాక్షి యాజమాన్యం తరఫున కాంస్య పతకంతో పాటు రూ.5 వేల నగదు బహుమతి అందించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాఠశాల డైరెక్టర్ కేఎస్వీ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. కాన్సెప్ట్ ఆధారిత విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం నీలకంఠేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.