రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి, నలుగురికి గాయాలు
మఠంపల్లి (నల్గొండ జిల్లా) : మఠంపల్లి మండలం రఘనాథపాలెం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మేళ్లచెరువు మండలం కిష్టాపురం గ్రామంలో మొక్కలు నాటేందుకు 40 మంది కూలీలు మఠంపల్లి నుంచి ట్రాక్టర్లో బయలుదేరారు.
రఘనాథపాలెం వద్ద ట్రాలీ వెనుక డోర్ ఊడి కింద పడటంతో దానిపై కూర్చున ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మేకలవీరయ్య(55) అనే వ్యక్తి మరణించాడు. గాయపడ్డ నలుగురిలో ఇద్దరు ఖమ్మంలో, మరో ఇద్దరు హుజూర్నగర్లో చికిత్స పొందుతున్నారు.