Maulana Syed Arshad Madani
-
‘అయోధ్య’పై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ జన్మభూమి– బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. తీర్పులో కొన్ని తప్పులున్నాయని, వాటిని సవరించాలని కోరుతూ సోమవారం మౌలానా సయ్యద్ అషాద్ రషీది, జామియత్ ఉలేమా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. సయ్యద్ రషీది తొలి పిటిషన్‌దారు ఎం సిద్ధిఖీకి చట్టబద్ధ వారసుడు. ‘ఆ స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాలని తీర్పునివ్వడం ద్వారానే నిజమైన న్యాయం జరిగినట్లవుతుంది’ అని 93 పేజీల ఆ రివ్యూ పిటిషన్లో పేర్కొన్నారు. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం జరగాలని, ప్రతిగా, ముస్లింల తరఫున సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 9న సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
ఆవుకు జాతీయ జంతువు హోదా!
తాము మద్దతిస్తామన్న జమైత్ ఉలేమా–ఐ–హింద్ అధ్యక్షుడు న్యూఢిల్లీ: ఆవుకు జాతీయ జంతు వు హోదా ఇవ్వడంపై ఆలోచన చేయాలని జమైత్ ఉలేమా–ఐ– హింద్ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదాని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ ప్రతిపాదనకు తాము మద్దతిస్తామని ప్రకటిం చారు. దేశంలోని ఇస్లామిక్ మేధావులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అత్యంత ప్రభావవం తమైన సంస్థకు అధిపతి అయిన ఆయన బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడు తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంత రించుకున్నాయి. గోసంరక్షకుల పేరిట కొనసాగుతున్న హింస నేపథ్యంలో ‘భయపూరిత వాతావ రణం’ నెలకొనడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మతాన్ని అడ్డుపెట్టుకుని గోసంరక్షకులు దాడులకు, హత్యలకు పాల్పడుతున్నారని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని చెప్పారు. హిందువుల మతవిశ్వాసాల్ని తాము గౌరవిస్తామని, అయితే ఏ ఒక్కరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు అనుమతించరాదని అన్నారు. -
‘ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయండి’
ముంబై: ముస్లిం యువకులపై నమోదైన ఉగ్రవాద కేసుల విచారణ కోసం ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని జమాయత్ ఉలేమా ఇ హింద్ సంస్థ డిమాండ్ చేసింది. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనే అంశంపై ఆజాద్ మైదాన్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆ సంస్థ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మద్ని ప్రసంగించారు. ఉగ్రవాద కేసుల్లో చిక్కుకున్న ముస్లిం యువకుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఇది ఆందోళనకరమైన విషయమన్నారు. మైనారిటీల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద కేసుల్లో ముస్లిం యువకులు చిక్కుకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇటువంటి కేసుల్లో అమాయక ముస్లిం యువకులు అరెస్టవుతున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కూడా పేర్కొన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనేక ఉగ్రవాద కేసులకు సంబంధించి అనేక తీర్పులొచ్చాయని, ఆ కేసుల్లో చిక్కుకున్న ముస్లిం యువకులు విడుదలయ్యారని అన్నారు. అయితే ఇంకా కొంతమంది కారాగారాల్లోనే ఉన్నారని, ఆ నష్టాన్ని ఏవిధంగా పూడుస్తారంటూ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కేసుల ఉపసంహరణ విషయాన్ని రాష్ట్రప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అందువల్ల ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలన్నారు.