McKinsey & Co
-
2030 నాటికి జాబ్ మార్కెట్ షేక్.. కలవరపెడుతున్న రిపోర్ట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చే దశాబ్దంలో జాబ్ మార్కెట్లో గణనీయమైన మార్పులకు కారణమవుతుంది. మెకిన్సే నివేదిక ప్రకారం.. 2030 నాటికి సుమారు 1.2 కోట్ల వృత్తిపరమైన పరివర్తనలకు దారితీస్తుంది. ఇది కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కనిపించిన ఉద్యోగ మార్పులతో పోల్చదగిన వేగం.మెకిన్సే సీనియర్ పార్ట్నర్, దాని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ క్వైలిన్ ఎలిన్‌గ్రుడ్ ఇటీవల జరిగిన మీడియా డే సందర్భంగా ఈ విషయాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పురోగతి కారణంగా కొన్ని రంగాలు ముఖ్యంగా హెల్త్ కేర్, స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) రంగాలు వృద్ధిని చవిచూస్తాయని భావిస్తున్నారు.ప్రభావితమయ్యే రంగాలు ఇవే..ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావిత ఉద్యోగ మార్పులు ప్రధానంగా నాలుగు ప్రధాన విభాగాలలో కేంద్రీకృతమై ఉంటాయి. అవి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్, కస్టమర్ సర్వీస్ అండ్ సేల్స్, ఫుడ్ సర్వీస్ అండ్ ప్రొడక్షన్, మ్యాన్యుఫ్యాక్చరింగ్. ఈ విభాగాల్లో పునరావృత పనులు, డేటా కలెక్షన్, ప్రాథమిక డేటా ప్రాసెసింగ్ నిర్వహించే వారిపై మార్పు ప్రభావం ఉంటుందని ఎల్లిన్గ్రుడ్ పేర్కొన్నారు. ఈ విధులు ఆటోమేషన్‌కు ప్రధాన లక్ష్యమని, వీటిని ఏఐ సమర్థవంతంగా నిర్వహించగలదని ఆమె చెబుతున్నారు. 2030 నాటికి డిమాండ్ తగ్గుతున్న ఉద్యోగాల్లోని సుమారు 1.18 కోట్ల మంది కొత్త పనులకు మారాల్సి ఉంటుందని మెకిన్సే నివేదిక అంచనా వేసింది.ఈ మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఎలిన్‌గ్రుడ్ ఎత్తిచూపారు. అభివృద్ధి చెందుతున్న జాబ్ ల్యాండ్ స్కేప్ గురించి తెలుసుకోవడం, ఆటోమేషన్ కు తక్కువ అవకాశం ఉన్న నైపుణ్యాలను పెంపొందించుకోవడం వ్యక్తులకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మానవ సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను యంత్రాలు భర్తీ చేయలేవు. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆమె సూచిస్తున్నారు. -
‘పని చేయకపోయినా జీతం ఇస్తాం’
అంతర్జాతీయంగా చాలా కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట, ఖర్చులు తగ్గించుకునేందుకు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అందులో భాగంగా గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ మెకిన్సే ఉద్యోగుల సంఖ్యను కుదించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీ నుంచి తప్పుకోవాలని కోరింది. అందుకుగాను వారికి ఒక ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఉన్నపలంగా ఉద్యోగం పోయిందంటే కుంటుంబ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇతర ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి తమ సంస్థ నుంచి స్వచ్ఛందంగా తప్పుకునే ఉద్యోగులకు మెకిన్సే తొమ్మిది నెలలపాటు జీతం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో మరో ఉద్యోగం వెతుక్కునేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే క్లైంట్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం ఇకపై అందులో కొనసాగబోరని తేల్చి చెప్పింది. వారు ప్రాజెక్ట్ పనిలో నిమగ్నం కాకుండా ఇతర ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేపట్టవచ్చని చెప్పింది. కార్యాలయ పనిగంటల్లోనూ వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసే వెసులుబాటు కల్పించింది. ఇదీ చదవండి: ఎన్హెచ్ఏఐ నిర్ణయానికి ‘నో’ చెప్పిన ఈసీ మెకిన్సే 2023లో వివిధ కారణాలతో దాదాపు 1400 మంది ఉద్యోగులను తగ్గించుకుంది. ఈ సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 3 శాతంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సంస్థలో పనిచేస్తున్న దాదాపు 3000 మంది ఉద్యోగుల పనితీరుపై మండిపడింది. వారి పనితీరును మెరుగుపరచడానికి మూడు నెలల సమయం కూడా ఇచ్చినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక ద్వారా తెలిసింది. -
పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే కాలుష్యం ఎక్కువ?
కాప్-26 స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నవంబర్ 1 నుంచి 12 వరకు జరుగుతోంది. ఈ వాతావరణ సదస్సులో పర్యావరణ సమస్యలపై ప్రపంచం దృష్టి సారించడంతో రాబోయే కాలంలో కాలుష్యం తగ్గించాలని అన్నీ దేశాలు భావిస్తున్నాయి. ఎక్కువగా పరిశ్రమలు, వాహనాల చేత వాయు కాలుష్యం ఏర్పడుతుంది. పెట్రోల్ వాహనాల వల్ల వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ఎక్కువ శాతం దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంధనాన్ని మండించడం వల్ల ప్రత్యక్ష కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల్లో దాదాపు పావు వంతు రవాణా రంగం బాధ్యత వహిస్తుంది. అందులో ప్యాసింజర్ కార్లు 45% ఉన్నాయి. ఈ సవాలు నుంచి బయటపడేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఒక సమాధానంగా కనిపిస్తున్నాయి. అయితే, ఇక్కడే మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాల్సి ఉంది. ఒక వాహనం తయారు కావాలంటే 20,000 నుంచి 30,000 విడిభాగలు అవసరం. ఈ విడిభాగల తయారీ కోసం కొన్ని వేల టన్నుల అల్యూమినియం, ఉక్కు ఇతర పదార్థాలు అవసరం. ఈ ముడి పదార్ధాల తయారీ సమయంలో పరిశ్రమల ద్వారా ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఐసీఈతో పోలిస్తే సంప్రదాయ అంతర్గత కంబస్టివ్ ఇంజిన్(ఐసీఈ)తో పోలిస్తే బ్యాటరీ-ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేటప్పుడు విడుదల చేసే గ్రీన్ హౌస్ వాయువులు అధిక భాగాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈవీ ఉత్పత్తి ఊపందుకోవడంతో బ్యాటరీ ఉత్పత్తి, పరిశోధనలు, అమ్మకాలు పెరుగుతున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వల్ల గ్రీన్ హౌస్ ఉద్గారాలు 2040 నాటికి 60% కంటే ఎక్కువకు పెరగబోతున్నాయని కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే కంపెనీ తెలిపింది. ఈ సంస్థ "సరఫరా గొలుసులో డీకార్బనైజేషన్ ప్రాముఖ్యతను విస్మరించలేము" అని గ్రీన్ పీస్ ఈ వారం ప్రచురించిన నివేదికలో పేర్కొంది. (చదవండి: ఇది ట్రక్కు కాదు నడిచే ఇళ్లు.. అచ్చంగా హీరోల తరహాలో) ఈ నివేదికలో పేర్కొన్నట్టు మనం ఒకదాని గురుంచి తెలుసుకోవాలి.. మెరుగైన ఈవీ బ్యాటరీలను తయారు చేయడానికి, రేంజ్ ఎక్కువగా రావడానికి సాంకేతిక నిపుణులు భారీ పరిమాణంలో బ్యాటరీలను తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల బరువు పెరుగుతుంది. ఇతర భాగాల బరువు + బ్యాటరీ బరువు కలిపితే వాహనం బరువు పెరుగుతుంది. దీంతో మొత్తంగా వాహనం బరువు పెరగడం చేత మళ్లీ రేంజ్ సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమస్యను అరికట్టడం కోసం కార్ల కంపెనీలు తేలికపాటి బరువు ఉండే అల్యూమినియం వినియోగం వైపు దృష్టి పెడుతున్నారు. సాంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో 45% లోహాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు నివేదికలో పేర్కొంది. అల్యూమినియం డిమాండ్ పెరగడం చేత లోహ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. ఉత్పత్తి పెరగడంతో వాయు కాలుష్యం అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ రకంగా చూస్తే పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే ఎక్కువ వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతోంది. (చదవండి: ఐఓసీఎల్ బాటలోనే బీపీసీఎల్.. బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లు!) ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం పవర్ అవసరం అనే విషయం అందరికీ తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ వల్ల విద్యుత్ కి డిమాండ్ పెరుగుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వాలు, కంపెనీలు థర్మల్ కర్మాగారాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇక్కడ సౌర విద్యుత్ ఆప్షన్ ఉన్న ప్రస్తుతం మన దేశంతో సహ ఇతర దేశాలలో ఇంకా అంత ఎక్కువగా అందుబాటులోక రాలేదు. అందుకని ఎలక్ట్రిక్ వాహన సంస్థలు, ప్రభుత్వాలు ఈ సమస్యల మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది. -
పదోన్నతుల్లో మహిళలకు మొండిచేయే!
న్యూయార్క్: పదోన్నతులు, వేతనాల్లో పురుషులతో పోలిస్తే మహిళలకు తక్కువ అవకాశాలు లభిస్తున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఫేస్బుక్ సంస్థ చీఫ్ ఆరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండబర్గ్, మెక్‌కెన్సీ అండ్ కంపెనీతో కలసి ఈ విషయాలపై అధ్యయనం చేశారు. 46 లక్షల కార్మికులు ఉన్న 132 కంపెనీల్లో, 34 వేల మందికిపైగా ఉద్యోగులను సర్వే చేశారు. పదోన్నతుల కోసం పురుషులతోపాటు మహిళలు పోటీ పడుతున్నా వారికి సరైన అవకాశాలు దక్కడంలేదని, బాస్‌లుగా, దూకుడుగా ఉండడానికి వారు భయపడుతున్నారని తేలింది. శరీర రంగు కూడా ఆడవారి పురోగతికి అడ్డంకిగా ఉన్నట్లు గుర్తించారు.