అంతర్జాతీయంగా చాలా కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట, ఖర్చులు తగ్గించుకునేందుకు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అందులో భాగంగా గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ కంపెనీ మెకిన్సే ఉద్యోగుల సంఖ్యను కుదించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీ నుంచి తప్పుకోవాలని కోరింది. అందుకుగాను వారికి ఒక ఆఫర్‌ను కూడా ప్రకటించింది.
ఉన్నపలంగా ఉద్యోగం పోయిందంటే కుంటుంబ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇతర ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి తమ సంస్థ నుంచి స్వచ్ఛందంగా తప్పుకునే ఉద్యోగులకు మెకిన్సే తొమ్మిది నెలలపాటు జీతం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో మరో ఉద్యోగం వెతుక్కునేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటికే క్లైంట్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం ఇకపై అందులో కొనసాగబోరని తేల్చి చెప్పింది. వారు ప్రాజెక్ట్ పనిలో నిమగ్నం కాకుండా ఇతర ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేపట్టవచ్చని చెప్పింది. కార్యాలయ పనిగంటల్లోనూ వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసే వెసులుబాటు కల్పించింది.
ఇదీ చదవండి: ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయానికి ‘నో’ చెప్పిన ఈసీ
మెకిన్సే 2023లో వివిధ కారణాలతో దాదాపు 1400 మంది ఉద్యోగులను తగ్గించుకుంది. ఈ సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 3 శాతంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సంస్థలో పనిచేస్తున్న దాదాపు 3000 మంది ఉద్యోగుల పనితీరుపై మండిపడింది. వారి పనితీరును మెరుగుపరచడానికి మూడు నెలల సమయం కూడా ఇచ్చినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment