కేసీపీలో క్రషింగ్ ప్రారంభం
ఉయ్యూరు : కేసీపీ చక్కెర కర్మాగారంలో 2014-15 సీజన్ క్రషింగ్ ప్రారంభమైంది. సంస్థ ఎండీ ఇర్మ్‌గార్డ్ వెలగపూడి శుక్రవారం అర్ధరాత్రి 12.01 గంటలకు స్విచ్ ఆన్‌చేసి క్రషింగ్ ప్రారంభించారు. అంతకుముందు చెరుకు లోడుతో ఉన్న ట్రక్కుకు కేసీపీ సీవోవో జి.వెంకటేశ్వరరావు పూజ నిర్వహించి తొలి పర్మిట్‌ను చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎస్వీ కృష్ణారావుకు అందజేశారు. ఎండీ ఇర్మ్‌గార్డ్ మాట్లాడుతూ రైతు, కార్మిక సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. దేశంలో ఏ కర్మాగారమూ చెల్లించని విధంగా తమ కర్మాగారానికి చెరుకు రవాణా చేసిన 14 రోజుల్లో రైతుకు నగదు చెల్లిస్తున్నామని తెలిపారు.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పద్మరాజు, కేసీపీ సంస్థ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) ఫ్లోరెన్స్, జీఎంలు వీవీ పున్నారావు (కేన్), సీకే వసంతరావు (ఫైనాన్స్), హరిబాబు (ప్రాసెస్), అడ్వైజర్ కృష్ణ, హెచ్ఆర్ మేనేజర్ దాస్, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు.