ఏఎస్సైకు ఇండియన్ పోలీస్ మెడల్
చాగల్లు: చాగల్లు పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న మురుగుమువ్వల ధనరాజ్‌కు ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు దక్కింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్ర మినిస్టరీ ఆఫ్ హోం ఎఫైర్స్, న్యూఢిల్లీ తనను అవార్డుకు ఎంపికచేసినట్టు ఆదివారం సాయంత్రం సమాచారం వచ్చిందని ధనరాజ్ తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 14 మంది పోలీస్ సిబ్బంది, అధికారులు మెడల్‌కు ఎంపికయ్యారని చెప్పారు.
కానిస్టేబుల్ నుంచి ఎదిగి.. 1984లో ధనరాజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి 2010లో హెచ్‌సీగా, 2013లో ఏఎస్సైగా పదోన్నతులు పొందారు. ఉత్తమ పనితీరులో 31సార్లు నగదు పురస్కారాలు, 207 గుడ్ సర్వీస్ ఎంట్రీలు, జిల్లా పోలీస్ అధికారుల చేతులమీదుగా పురస్కారాలు పొందారు. ధనరాజ్ తండ్రి సూర్యప్రకాశరావు కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయన స్వగ్రామం పెంటపాడు. అవార్డుకు ఎంపికైన ధనరాజ్‌ను పలువురు అభినందించారు.