సర్వేపై వైఎస్సార్సీపీ అవగాహన
ఖమ్మం మామిళ్లగూడెం : ఈనెల 19న జరగనున్న సమగ్ర సర్వేపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎం.డి.ముస్తఫా ఆధ్వర్యంలో ఆదివారం ప్రజలకు అవగాహన కల్పించారు. సర్వే వివరాలతో కూడిన కరపత్రాల ద్వారా ఖమ్మం నగరంలో ప్రచారం నిర్వహించారు. సర్వేలో అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు నిర్దిష్టంగా సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ సర్వే వల్ల భవిష్యత్తులో కలిగే ఉపయోగాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈ సర్వేలో పాల్గొన్న వారికే ప్రభుత్వ పథకాలు అందుతాయని, ప్రతి ఒక్కరూ సర్వేలో పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర నాయకులు ఎం.డి.ఫిరోజ్, ఎస్.కె.అన్వర్, ఎం.డి.ఆరీఫ్, హబీబ్, వెంకట్, కిషోర్, భరత్, సృజన్, హనీఫా, సందీప్, సాయి తదితరులు పాల్గొన్నారు.