meat banned
-
తమిళనాడు రాజ్‌భవన్‌లో మాంసాహారం నిషేధం
-
తమిళనాడు రాజ్‌భవన్‌లో మాంసాహారం నిషేధం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ తన అధికార నివాసమైన చెన్నైలోని రాజ్‌భవన్‌లో మాంసాహారాన్ని నిషేధించారు. కనీసం కోడిగుడ్డు సైతం రాజ్‌భవన్‌లోకి ప్రవేశించరాదని షరతు పెట్టారు. రాజ్‌భవన్ సిబ్బంది మాంసాహారం తినాలని భావిస్తే బయటకు వెళ్లి తిని రావాలని గవర్నర్ సూచించారు. రాజ్‌భవన్‌కు వచ్చే కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులకు శాఖాహార వంటలే వడ్డించాలని నిర్ణయించారు. గత నెల 6న తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన మహారాష్ట్రకు చెందిన పురోహిత్ కొత్త పంథాలో వెళ్తున్నారు. తనను కలవడానికి రాజ్‌భవన్‌కు వచ్చేవారు పూలమాలలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలు తేవద్దని సూచించారు. తమిళులతో మరింతగా మమేకమయ్యేందుకు తమిళం నేర్చుకుంటున్నారు. తమిళ అధ్యాపకుడు ఒకరు రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్‌కు తమిళం నేర్పిస్తున్నారు. రాజ్‌భవన్‌కు పరిమితం కాకుండా కోయంబత్తూరు వెళ్లి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఇకపై అన్ని జిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాలనలో గవర్నర్ జోక్యంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడంపై స్పందిస్తూ.. ప్రజాశ్రేయస్సు కోసమే తన ప్రయత్నమన్నారు. -
అక్కడ మాంసాహారం నిషిద్ధం..
కఠ్మాండు: తీవ్ర భూకంపంతో నేలమట్టమైన నేపాల్‌లో జంతువులు, పక్షుల వేటను, మాంసాహారాన్ని నిషేధించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని భావించిన కఠ్మాండు ప్రభుత్వం వేటను, మాంసాహారాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాంసాహారం భుజించడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, మాంసం, సంబంధిత ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ నోటీసులు జారీ చేసింది. పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్య సంరక్షణార్థం తామీ నిర్ణయం తీసుకున్నామని కఠ్మాండు జిల్లా అధికారి ఈకె నారాయణన్ తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 6,600మందిని పొట్టన పెట్టుకున్న భూకంపం లక్షలాదిమందిని క్షతగాత్రులుగా మార్చింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరుస భూకంపాలతో చిగురుటాకుల్లా వణికిపోయిన ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడిపోయారు. ఆరుబయటే టెంట్లలో కాలం గడుపుతున్నారు. ఎక్కడా చూసినా అపరిశుభ్రమైన వాతావరణం నెలకొంది. చాలా మంది ప్రజలు అనారోగ్యం బారిన పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అనేక ఏజెన్సీలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.