త్వరలో మెక్లారిన్ మహిళా వైద్య కళాశాల
కాకినాడ:
వందేళ్ల చరిత్ర కలిగిన కాకినాడ మెక్లారి¯ŒS హైస్కూల్ ఆవరణలో రూ.645 కోట్లతో మహిళా వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు సీబీసీఎ¯ŒSసీ అధ్యక్షుడు డాక్టర్ ముత్తాబత్తుల రత్నకుమార్ చెప్పారు. ఉత్తర సర్కార్ జిల్లాల బాప్టిస్టు సంఘాల మహాసభలు శుక్రవారం కాకినాడ సీబీఎం ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో డాక్టర్ రత్నకుమార్ మాట్లాడుతూ మహిళా వైద్య కళాశాల ఏర్పాటుకు ఇప్పటికే మెడికల్ కౌన్సిల్ ఆమోదం లభించిందని, త్వరలోనే భవన నిర్మాణం చేపడతామన్నారు. కళాశాల స్థాపనకు కెనడియ¯ŒS ఓవర్సిస్ మిష¯ŒS ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. సీబీసీఎ¯ŒSసీ ఆధ్వర్యంలో త్వరలో మరో ఏడు మహిళా కళాశాలలు, న్యాయవిద్య కళాశాలలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీబీసీఎ¯ŒSసీ ఆధ్వర్యంలో ఇప్పటికే 245 పాఠశాలల ద్వారా ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. ఈ మహాసభల్లో ఆల్ ఇండియా క్రిస్టియ¯ŒS కౌన్సిల్ అధ్యక్షుడు జార్జి, సీవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు మూర్తిరాజు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కోరా జయరాజు, గోదావరి అసోసియేష¯ŒS డైరెక్టర్ ఎజ్రా రమేష్, రాజమహేంద్రవరం అసోసియేష¯ŒS అధ్యక్షుడు రమేష్‌కుమార్, కోటనందూరు అసోసియేష¯ŒS అధ్యక్షుడు బి.శామ్యూల్ తదితరులు ప్రసంగించారు. ‘ప్రేమామయుడు’ క్రైస్తవ భక్తిగీతాల ఆడియో సీడీని ఆవిష్కరించారు.