ముగిసిన బాస్కెట్‌బాల్ శిక్షణ
ధర్మవరం అర్బన్ : బాస్కెట్‌బాల్ క్రీడను మరింత అభివృద్ధి చేస్తామని కాకతీయ విద్యానికేతన్ ఉన్నతపాఠశాల వ్యవస్థాపకుడు మేడాపురం రామిరెడ్డి, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు శెట్టిపి జయచంద్రారెడ్డి, హిదయ్‌తుల్లాలు పేర్కొన్నారు. ధర్మవరంలోని కాకతీయ విద్యానికేతన్‌లో ఐదురోజులుగా స్పెయిన్‌కు చెందిన బాస్కెట్‌బాల్ కోచ్‌లు విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ బుధవారంతో ముగిసింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులకు స్పెయిన్ కోచ్‌లో బాస్కెట్‌బాల్ క్రీడలో మంచి శిక్షణ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో కాకతీయ విద్యానికేతన్ కరస్పాండెంట్ నిర్మలా జయచంద్రారెడ్డి, డైరెక్టర్లు సూర్యప్రకాష్‌రెడ్డి, పద్మ, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.