22న వైద్యాధికారుల పోస్టులకు ఇంటర్వ్యూలు
ఎంజీఎం : రాషీ్ట్రయ బాలస్వాస్థ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్–15 నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న అలోపతిక్, ఆయుష్ అభ్యర్థులను మెడికల్ ఆఫీసర్ స్థానాలకు భర్తీ చేయగా, ఖాళీగా ఉన్న పోస్టులకు ఈనెల 22న డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు.
అలోపతిక్ విభాగంలో పురుషుల విభాగంలో 9, స్త్రీల విభాగంలో 11, అలాగే ఆయుష్ విభాగంలో పురుషుల విభాగంలో ఏడు, స్త్రీల విభాగంలో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపించామన్నారు.