హాస్టల్ కోసం వెళ్లిన విద్యార్థిని అదృశ్యం
బోడుప్పల్: హాస్టల్ తెరిచారో లేదో తెలుసుకోవడం కోసం వెళ్లిన ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన బుధవారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ తాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ శ్రీరాంనగర్ కాలనీలో నివసించే బూడిద మల్లయ్య కుమార్తె రోజ(17) నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతుంది.
మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాలేజీ హాస్టల్ తెరిచారో లేదా తెలుసుకుని వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే రాత్రి అయినా ఆమె ఇంటికి తిరిగిరాలేదు. స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం మేడిపల్లి పోలీస్స్టేషన్లో ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తాజుద్దీన్ వివరించారు.