meerut municipal corporation
-
బీజేపీ, బీఎస్పీ కౌన్సిలర్ల బాహాబాహీ
-
బీజేపీ, బీఎస్పీ కౌన్సిలర్ల బాహాబాహీ
సాక్షి, మీరట్ : యూపీలోని మీరట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ప్రతినిధుల బాహాబాహీకి వేదికైంది. బీజేపీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు ఒకరిని ఒకరు తోసుకుంటూ పరస్పర దాడులకు పాల్పడ్డ వీడియో కలకలం రేపింది. మంగళవారం కౌన్సిల్ భేటీ సందర్భంగా ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొని ఘర్షణకు దారితీసింది. సభ్యులు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడటంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని గాడినపెట్టాల్సి వచ్చింది. మీరట్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ, బీఎస్పీ సభ్యుల మధ్య రగడ ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో వందే మాతరం గీతాలాపన విషయంలోనూ ఇరు పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రజా ప్రతినిధులు కార్పొరేషన్లో అమర్యాదకరంగా వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘మీరు ఈ సమావేశంలో వద్దు పోండి’
లక్నో: వందేమాతరం ఆలపించని ఏడుగురు కార్పొరేటర్లను తాను నిర్వహిస్తున్న సమావేశానికి హాజరుకావొద్దని మీరట్ కార్పొరేషన్ మేయర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో వారు ఈ సమావేశంలో ఉండకూడదని గదమాయించి అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది. ఇందులో రికార్డయిన ప్రకారం మీరట్ మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఇందులో కార్యక్రమాలు ప్రారంభమవడానికి ముందు అంతా వందేమాతరం ఆలపించాలని మీరట్ మేయర్ హరికాంత్ అహ్లువాలియా ఆదేశించారు. ఈయన బీజేపీ నేత. ప్రస్తుతం మీరట్ కార్పొరేషన్లో బీజేపీదే మెజార్టీ. ఈ నేపథ్యంలో అందులో ఉన్న ఓ ఏడుగురు కార్పొరేటర్లు వందేమాతరం ఆలపించబోమని, అసలు అలాంటిది వద్దంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయన వారిని అసలు ఆ సమావేశంలో ఉండొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వివరణ ఇచ్చే వరకు కూడా మున్ముందు జరగబోవు నగర్ నిఘమ్ సమావేశాలకు హాజరవ్వకూడదని ఆర్డర్ కూడా జారీ చేశారు. అయితే, బలవంతంగా ఎవరితోనూ వందేమాతరం పాడించవద్దని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.