‘బాబు’ సభకు జనం కోసం
నేడు కాకినాడలో పాఠశాలల పనివేళల మార్పు
ఉదయం 7 నుంచి 2 గంటల వరకు నిర్వహణ
10గంటలకు ర్యాలీకి రావాలని ఆదేశాలు
15 వేల మంది విద్యార్థులు పాల్గొనాలని లక్ష్యం
కాకినాడ :
కళాశాలలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం పాల్గొనే కాకినాడ బహిరంగ సభకు అధికారులు జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సమయ వేళలను కూడా మార్పు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహరావు ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కళాశాలలు, పాఠశాలలు పనిచేయాలని డీఈవో పేరుతో జారీ అయిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధికారికంగా ఇలా ఉత్తర్వులు ఇచ్చిన డీఈవో అనధికారికంగా అన్ని కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులకు మాత్రం ఉదయం 10 గంటలకు కాకినాడ టూటౌ¯ŒS పోలీసుస్టేçÙ¯ŒS నుంచి ప్రారంభమయ్యే ర్యాలీకి విద్యార్థులను తరలించాలని ఆదేశాలిచ్చారు.మున్సిపల్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 8,9,10 తరగతుల విద్యార్థులను సీఎం పాల్గొనే ర్యాలీ వద్దకు హాజరుకావాలని కోరారు. హైస్కూల్ విద్యార్థుల ద్వారా సుమారు 8 వేల మందిని సమీకరించేందుకు సన్నాహాలు చేశారు. మరో వైపు ఇంటర్, డిగ్రీ విద్యార్థుల ద్వారా మరో 7 వేల మందిని సమీకరించేందుకు ఆయా కళాశాలలకు కూడా ఆదేశాలిచ్చారు. మొత్తం మీద 15వేల మంది విద్యార్థులను సమీకరించడమే లక్ష్యంగా సమయ వేళలు మార్చడంతోపాటు ఆదేశాలు కూడా పంపారు. వీరంతా సీఎంతోపాటు టూటౌ¯ŒS పోలీసు స్టేష¯ŒS నుంచి జరిగే ర్యాలీలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఆయా కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయులను ఉదయం 8 గంటలకే సిద్ధంగా ఉండాలని కూడా పేర్కొన్నారు.
పర్యటన సాగేదిలా....
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కాకినాడకు రానున్నారు. ఉదయం 11 గంటలకు టూటౌ¯ŒS పోలీసుస్టేçÙ¯ŒS వద్దకు చేరుకుంటారు. విద్యార్థులతో జరిగే ర్యాలీని ప్రారంభిస్తారు. అనంతరం అపోలో హాస్పటల్ వీధి నుంచి గాంధీబొమ్మ సెంటర్ మీదుగా రామకృష్ణారావుపేట వెళ్తారు. అక్కడ నుంచి రామకృష్ణారావుపేటలో కాలినడకన వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న స్మార్ట్ స్కూల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడతారు. స్థానికంగా ప్రజలతో కూడా చంద్రబాబు మాట్లాడతారు. అనంతరం ఆనందభారతి గ్రౌండ్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి బహిరంగ సభలో మాట్లాడతారు.