కర్ణాటక - ఆంధ్ర పోలీసుల భేటీ
పావగడ: కర్ణాటక - ఆంధ్ర సరిహద్దు సమస్యలపై చర్చించడానికి ఆంధ్ర , కర్ణాటక ప్రాంతాలకు చెందిన పోలీసు అధికారులు స్థానిక నిడుగల్కొండలో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మధుగిరి డీఎస్పీ కల్లేశప్పతో పాటు శిర, కళ్యాణదుర్గం, మడకశిర డీఎస్పీలు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 40 మంది పోలీసు అధికారులు పాల్గొన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో సరిహద్దు ప్రాంతాలలో నేరాల నివారణ పై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు తెలిసింది.
ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఆచూకీ లభించని గుర్తు తెలియని శవాల ఉదంతాలపై కూడా మాట్లాడినట్లు సమాచారం. అంతే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో అసాయింఘిక కార్యకలాపాల నివారణపై కూడా లోతుగా చర్చించినట్లు తెలిసింది. సరిహద్దు ప్రాంతాల్లో నేరాల అదుపుకు ఇరు ప్రాంతాల పోలీసు అధికారులు సంయుక్తంగా కూంబింగ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.