ప్రొ.కోదండరామ్ తో మేథాపాట్కర్ భేటీ
⇔ తెలంగాణలో సమావేశం ఏర్పాటు చేస్తాం: మేథాపాట్కర్
హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తో ప్రముఖ పర్యావరణవేత్త, ప్రజా ఉద్యమాల జాతీయ సంఘటన(ఎన్ఏపీఎం) వ్యవస్థాపకురాలు మేథాపాట్కర్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పరిస్థితులను ప్రొఫెసర్ కోదండరామ్ ను అడిగి ఆమె తెలుసుకున్నట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో ఉద్యమ సంస్థలు, ప్రజాసంఘాలతో కలిసి తెలంగాణలో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని మేథాపాట్కర్ తెలిపారు.