ఆల్ క్లియర్
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శంకర్ విజువల్ వండర్ ‘ఐ’ చిత్రానికి అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే. వాటన్నిటినీ అధిగమించి జనవరి 14న ‘ఐ’ విడుదల కానున్నట్లు మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సంస్థ ప్రకటించింది. నిర్మాత ‘ఆస్కార్’ రవిచంద్రన్ తమకు 19 కోట్ల రూపాయలు చెల్లించేంత వరకు స్టే విధించాలని పిక్చర్ మీడియా హౌస్ పిటిషన్ వేసిన నేపథ్యంలో చిత్రం యథావిధిగా ప్రేక్షకుల ముందుకు రానుంది.