Mega Survey
-
ఇంటింటా ‘నమ్మకం’.. జగనన్నే మా భవిష్యత్తు.. 1.1 కోట్ల మిస్డ్ కాల్స్
సాక్షి, తాడేపల్లి: జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేలో 1.45 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్సీపీ చేరువైంది. ప్రభుత్వ పాలనపై 80 శాతం ప్రజల సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని భారీ మెగా పీపుల్స్ సర్వేగా జగనన్నే మా భవిష్యత్తు నిలిచింది. సర్వేలో విశేషంగా పాల్గొన్న ప్రజలకు వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మెగా సర్వేతో వైఎస్సార్సీపీ క్యాడర్ మరింత ఉత్సాహవంతమైంది. వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మక జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలను కలిసి సీఎం జగనన్న పాలనపై వారి అభిప్రాయాలను సేకరించింది. సీఎం జగన్ పాలనకు 1.1 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్ ద్వారా మద్దతు ప్రకటించారు. ఈ మెగా సర్వే పూర్తి వివరాలను పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు మీడియా సమావేశంలో వెల్లడించారు. సీఎం జగన్ పాలనపై 80 శాతం ప్రజల సంతృప్తి.. "జగన్ నాయకత్వం మీద రాష్ట్ర ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారు. ఇంత భారీ పబ్లిక్ సర్వే చేయడం ద్వారా వైఎస్సార్ సీపీ సాహసం చేసింది. ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే కార్యక్రమంతో చరిత్ర సృష్టించింది. ఈ సర్వేతో వైఎస్సార్ సీపీ రాజకీయంగా బలంగా ఉందని నిరూపించింది. ఈ మెగా సర్వే అన్ని రకాలుగా పారదర్శకంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టలేదు. తక్కువ సమయంలో ఈ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గ్రామస్థాయిలో కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్న వాస్తవాలు తెలుసుకున్నాము. ఇంత భారీ సర్వే చేయగలమా అనుకున్నాం కానీ సీఎం జగన్ నేతృత్వంలో విజయవంతం పూర్తి చేసాము. సర్వే ప్రారంభంలో మా అధినేత సీఎం జగన్ తన విజన్ ని నేతలకు పూర్తిగా వివరించడంతో దానికి తగినట్లుగా పనిచేసాము. ఈ సర్వేలో గత ప్రభుత్వం చేసిన పనితీరును మా ప్రభుత్వ పని తీరును గురించి ప్రజలని అడిగి తెలుసుకున్నాము. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా కూడా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీద ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నాం. మొత్తం ఆరు లెవల్స్ లో ఈ మెగా సర్వే పూర్తి చేసాము." అని రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు. 1.45 కోట్ల కుటుంబాల మద్దతుతో ఓ చరిత్ర "రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ మెగా సర్వేలో కకోటి 45 లక్షల కుటుంబాల మద్దతు సాధించి ప్రజల అభిప్రాయాలు తీసుకుని వైఎస్సార్ సిపీ ఓ చరిత్ర సృష్టించింది. 7 లక్షల మంది గృహసారథులు, నాయకల ద్వారా ఈ కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం అయ్యింది. ప్రజల్లో సీఎం జగనన్న ప్రభుత్వం మీద మంచి స్పందన వచ్చింది. ప్రజలు వారి భవిష్యత్తు కోసం మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. భావి తరాలు కూడా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సీఎం జగన్ తోనే సాధ్యం నమ్ముతున్నారు. ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలకు ప్రజల స్వచ్చందంగా సమాధానాలు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఈ మెగా సర్వే ఫలితాలు ప్రదర్శిస్తాము. సిఎం జగన్ ఇచ్చే ప్రతి పథకం ప్రజలకి నేరుగా అందుతోంది." "చంద్రబాబు సంస్కార హీనుడిలా మాట్లాడటం సరికాదు. ప్రజల ఇష్టంతోన్ వారి ఇళ్లకు స్టిక్కర్ అంటించాము. అన్ని పార్టీల ప్రజలకి పథకాలు అందుతున్నాయి. మే 9 నుండి జగన్నన్నకి చెబుదాం అనే నూతన కార్యక్రమం కూడా ప్రారంభిస్తాము." అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. ప్రజా మద్దతు వైఎస్సార్సీపీకే.. "ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ ఇలాంటి కార్యక్రమం చేయలేదు. మెగా సర్వేతో ప్రజా మద్దత్తు వైఎస్సార్ సీపీకే ఉందని స్పష్టం అయ్యింది. సిఎం జగన్ పాలనకు 80 శాతం ప్రజలు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రతి గడపకి మా నాయకులు వెళ్లి వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నారు. కాకినాడ, ఎన్టీఆర్, బాపట్ల, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలో సర్వే అద్భుతంగా జరిగింది. అవినీతి, వివక్ష లేని పాలనకు ప్రజలు మద్ధతుగా నిలిచారు.. ఇదే సర్వేలో స్పష్టమైంది. చంద్రబాబు ఇలాంటి సర్వే జీవితంలో ఎప్పుడైనా చేశారా. తాము 15 వేల సచివాలయల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించాము. సీఎం జగన్ చేస్తున్న మంచికి ప్రజల్లో ఆమోదం, సంతృప్తి ఉంది." అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వివరించారు. 22 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలకు చేరువ "దేశంలోనే ఇలాంటి సర్వే చేసిన మొదటి ప్రభుత్వం మాది. గతంలో 40 ఏళ్ళు అనుభవం అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. సీఎం జగనన్న చెప్పే మాటకు చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మా సైన్యం సిద్ధంగా ఉంది. కేవలం 22 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలను కలిసాము.ఇలాంటి కార్యక్రమం చేసే దమ్ము చంద్రబాబుకి ఉందా.. కులం, మతం అతీతంగా వైసీపీ పాలన చేస్తోంది. ఈ మాట చంద్రబాబు ఒక్కసారైనా తన ప్రభుత్వ హయాంలో చెప్పగలిగారా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెగా సర్వేను విజయవంతం చేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం." అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజా మద్దతు పుస్తకం ప్రజాభిప్రాయానికి ప్రతీక. "ఇలాంటి ఆలోచన దేశంలో ఎలాంటి సీఎంకి రాలేదు. ప్రజలోకి నేరుగా వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీద అభిప్రాయం తీసుకున్నాము. ప్రజా మద్దతు పుస్తకం ద్వారా ప్రజలు అభిప్రాయం చెప్పారు. కులం, మతం చూడకుండా ఓటు వేయని వారికీ కూడా లబ్ది చేకూరుతోంది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజలను ఈ సర్వేలో కలిసాము. చంద్రబాబు లాగా గాల్లో లెక్కలు వైఎస్సార్ సీపీ ఎన్నటికీ చెప్పదు. సీఎం జగనన్న పరిపాలన మీద ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టే జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేను ప్రజలు విశేష స్థాయిలో అందరించారు." అని విజయవాడ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ వివరించారు. చదవండి: రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన లక్ష్మీపార్వతి -
ఇంటికే వస్తారు.. జబ్బుల్ని పట్టేస్తారు
సాక్షి, అమరావతి: ప్రజలకు సంక్రమించే జీవన శైలి జబ్బులపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చురుగ్గా సర్వే జరుగుతోంది. దేశంలో ఎక్కడా చేయని విధంగా మధుమేహం, కుష్టు, హైపర్ టెన్షన్, క్యాన్సర్ తదితర జబ్బుల బారినపడిన వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఇప్పటికే 15 రోజులుగా సుమారు 19 వేల మంది ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి వ్యాధి లక్షణాలను పరీక్షిస్తున్నారు. మరీ ముఖ్యంగా రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి తక్షణమే ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా చికిత్స అందించడంతోపాటు అవసరమైన మందులను ఉచితంగా ఇస్తారు. మొత్తంగా రాష్ట్రంలోని 5.34 కోట్ల మంది ఆరోగ్య స్థితిగతులను ప్రతి ఇంటికీ వెళ్లి సేకరిస్తున్నారు. సమగ్ర సర్వే పూర్తి కావడానికి మరో 90 రోజులు పట్టే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద సర్వే అని అధికారులు పేర్కొంటున్నారు. 19 శాతం సర్వే పూర్తి రాష్ట్రంలో ఇప్పటివరకూ 19.01 శాతం జనాభాను సర్వే చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 19.43 శాతం, పట్టణ ప్రాంతాల్లో 17.27 శాతం సర్వే పూర్తయింది. గ్లూకోమీటర్, హిమోగ్లోబిన్ మీటర్ల ద్వారా మధుమేహం, రక్తహీనతల్ని గుర్తిస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన సర్వేలో హైపర్ టెన్షన్ (రక్తపోటు) బాధితులు అధికంగా ఉన్నట్టు ప్రాథమికంగా తేలింది. దీనికి కొంచెం అటూఇటుగా మధుమేహ బాధితులూ ఉన్నారు. విచిత్రం ఏమంటే.. 35 ఏళ్లలోపు వారికి కూడా మధుమేహం లక్షణాలు ఉన్నట్టు తేలింది. (చదవండి: దసరా కానుక.. ఏపీ ప్రభుత్వం తీపి కబురు) యాప్‌లో నమోదు చేసి.. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలనూ ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. మొత్తం సర్వే పూర్తయ్యాక రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా వ్యాధి లక్షణాలున్న వారికి ఏ ఆస్పత్రిలో వైద్యం అందించాలి, ఎక్కడ మందులు ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. అనంతరం వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారింటికి ఏఎన్ఎంలు వెళ్లడం లేదంటే ఫోన్ ద్వారా వారిని ఆస్పత్రులకు పిలిపించి వైద్య సదుపాయం కల్పిస్తారు. ఈ వివరాలన్నీ 104 సేవలకు, పీహెచ్‌సీలకు అనుసంధానం చేసి పర్యవేక్షణ చేయాలనేది సర్కారు యోచన. ప్రతి ఒక్కరికీ ఎంత ఖరీదైన మందులైనా ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. (చదవండి: అన్ని పథకాలకు అండగా నిలుస్తాం) జిల్లాల వారీగా ఇప్పటికే సర్వే పూర్తయిన ఇళ్ల సంఖ్య జిల్లా పట్టణ ప్రాంతాల్లో సర్వే చేసిన ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేసిన ఇళ్లు విజయనగరం 22,594 1,29,356 శ్రీకాకుళం 4,929 91,816 విశాఖపట్నం 27,116 2,01,737 తూర్పు గోదావరి 66,321 3,11,412 పశ్చిమ గోదావరి 40,953 2,07,383 కృష్ణా 71,081 2,10,787 గుంటూరు 60,760 1,44,198 ప్రకాశం 6,034 1,15,083 నెల్లూరు 29,640 1,24,161 చిత్తూరు 59,232 2,34,059 కర్నూలు 16,828 1,49,117 వైఎస్సార్ 41,554 1,87,662 అనంతపురం 44,472 2,22,656 ప్రాథమిక దశలోనే గుర్తించే వీలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు సేకరించడమనేది మహాయజ్ఞం లాంటిది. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్రమించే వివిధ వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి తక్షణ చికిత్స అందించే వెసులుబాటు కలుగుతుంది. ఏఎన్ఎంలు పక్కాగా వివరాలు సేకరిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో వివిధ జబ్బులతో బాధపడుతున్న వారిపై కచ్చితమైన అంచనా వస్తుంది. - అనిల్‌కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ -
సర్వేకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
రాంనగర్ :ఈ నెల 19న చేపట్టనున్న సమగ్రకుటుంబ సర్వే కోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శని వారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, నోడల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి మండలాన్ని క్లస్లర్లుగా విభజించుకుని ఆయా కస్టర్ల వారీగా రూట్లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలకు ఎన్యుమరేటర్లు సక్రమంగా చేరేవిధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. ఒక వేళ వర్షాలు కురిసే అవకాశం ఉం టే ఈనెల 18వ తేదీనే గ్రామాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎన్యుమరేషన్ పూర్తిచేయడంలో ఏమైనా సమస్య తలెత్తినట్లయితే వెంటనే సూపర్ వైజర్కుగానీ, నోడల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లి వారి సలహాలు తీసుకోవాలన్నారు. ఎన్యుమరేషన్ పూర్తి అయిన ఇంటికి స్టిక్కర్ అంటించాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేకు వెళ్లే ఎన్యుమరేటర్లకు అతని బ్లాకుకు సంబంధించిన పెన్షన్ వివరాలు, భూమికి సంబంధించిన వివరాలు, ఇళ్లకు సంబంధించిన సమాచారం అందజేయాలని సంబంధిత తహసీల్దార్లకు సూచించారు. ఎన్యుమరేటర్లు తక్కువ పడినట్లయితే డిగ్రీ చదువుకుని ఉన్న ఉపాధిహామీ పథకం మేట్లను తీసుకోవాలన్నారు. భార్యభర్త ఇద్దరూ ఉద్యోగులు అయి సర్వే విధులు నిర్వహిస్తున్నట్లయితే వారు విధులు నిర్వహిస్తున్నట్లు డ్యూటీ సర్టిఫికెట్ సమర్పించి తహసీల్దార్‌ను కలిసి తెలియజేసినట్లయితే సంబంధిత సూపర్వైజర్ మరుసటి రోజు వెళ్లి ఎన్యుమరే షన్ పూర్తిచేస్తారన్నారు. కుటుంబ సర్వే నిర్వహించే ముందు రోజు ప్రతి గ్రామంలో టాం...టాం వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు జేసీ వెంకట్రావ్, జిల్లా పరిషత్ సీఈఓ దామోదర్‌రెడ్డి, డీఆర్డీఏపీడీ సుధాకర్, డ్వామా పీడీ సునంద పాల్గొన్నారు. ప్రజల స్థితిగతులు తెలుసుకోవడం కోసమే సర్వే నల్లగొండ : ప్రజల స్థితిగతులు తెలుసుకోవడం కోసమే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులకు సమగ్ర కుటుంబ సర్వే -2014పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన వారందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సర్వే సామరస్య పూర్వకంగా, సుహృద్భావ వాతావరణంలో జరిగే విధంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో, మండలాల్లో సర్వేపై ప్రజలకు విస్త్రతంగా అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని, టాం.. టాం.. వేయించాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వే -2014పై ఫార్మాట్లను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజాప్రతినిధులకు వివరించారు. జిల్లా ప్రత్యేకాధికారి అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని వారికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అందించాలనే ఉద్దేశంతో ఈ సమగ్ర సర్వే నిర్వహిస్తుందన్నారు. దీనికి ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సదస్సులో ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, వీరేశం, రవీంద్రకుమార్, వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు. సభ్యులు సర్వేకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. సభ్యులు పోటీపడి మరీ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. సునీత జన్మదిన వేడుకలు సమావేశ అనంతరం ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత జన్మదిన వేడుకలను సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.