తెలంగాణకు 50 మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టులు
తెలంగాణకు 50 మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టులు
ఎనిమిది జిల్లాల్లోని రెండు లక్షల హెక్టార్లకు ప్రయోజనం
సాక్షి, హైదరాబాద్: సమీకృత వాటర్‌షెడ్ నిర్వహణ కార్యక్రమం(ఐడబ్ల్యూఎంపీ) కింద తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 50 మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ (వాటర్‌షెడ్స్) 2014-15 సంవత్సరానికి సంబంధించి పంపిన ప్రతిపాదనలకు ఐడబ్ల్యూఎంపీ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర భూవనరుల శాఖ నుంచి రాష్ట్రానికి సమాచారం అందింది. దీంతో ఈ ప్రాజెక్టులకు పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేస్తూ శనివారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి జె.రేమండ్ పీటర్ ఉత్తర్వులిచ్చారు. కొత్తగా మంజూరైన ప్రాజెక్టుల వల్ల ఎనిమిది జిల్లాల పరిధిలోని రెండు లక్షల హెక్టార్ల భూమికి ప్రయోజనం కలగనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.