మేఘాంశ్‌రామ్, తరుణ్ ముందంజ
బ్రిలియంట్ చెస్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: బ్రిలియంట్ ఓపెన్ ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్లో తొలి రోజు జూనియర్ విభాగంలో మేఘాంశ్‌రామ్, కె.తరుణ్ సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వీరితో పాటు కె.విశ్వజిత్ అరవింద్, జి.నితీష్ కుమార్, లాస్యప్రియ 3 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. ఓపెన్ కేటగిరీలో దీప్తాంశ్‌రెడ్డి, ఎం.చక్రవర్తిరెడ్డి, ఎం.వై.రాజు, భరత్ కుమార్‌రెడ్డి, జె.కె.రాజు, సుబ్బరాజు మూడు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో శనివారం జరిగిన జూనియర్ విభాగం మూడో రౌండ్లో మేఘాంశ్‌రామ్ (3)... కె.సుమంత్ (2)పై గెలుపొందగా, కె.తరుణ్ (3)... సి.హెచ్.సాయి గోపాల్ (2)పై, కె.విశ్వజిత్ అరవింద్ (3)... జి.అభినవ్ (2)పై విజయం సాధించారు. జి.నితీష్ కుమార్ (3)... కె.యశ్వంత్(2)ను, లాస్య ప్రియ(3)... జి.సాహిత్య(2)ను ఓడించారు. అలాగే ఓపెన్ కేటగిరీలో దీప్తాంశ్‌రెడ్డి (3)... షణ్ముఖ తేజ (2)పై, ఎం.చక్రవర్తిరెడ్డి (3)... ఎం.కౌశిక్(2)పై, ఎం.వై.రాజు (3), కవి సామ్రాట్ (2)పై, భరత్ కుమార్‌రెడ్డి (3)... ప్రసాద్‌రావు(2)పై, జె.కె.రాజు (3)... నాగభూషణం (2)పై నెగ్గారు.