బావతో కాపురం చేయనందుకు.. మేఘావతి హత్య
విశాఖపట్నం: విశాఖపట్టనానికి చెందిన నవ వధువు మేఘావతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లి రోజు నుంచే భర్తతో కాకుండా బావతో కాపురం చేయాలని మేఘావతిపై అత్త ఒత్తిడి చేసినట్టు విశాఖ నార్త్ జోన్ ఏసీపీ నాయుడు తెలిపారు. మేఘావతి తిరస్కరించడంతో పథకం ప్రకారం అత్తింటి వారు ఆమెను హతమార్చారని చెప్పారు.
నైలాన్ తాడుతో ఉరివేయడంతో మేఘావతి చనిపోయినట్టు ఏసీపీ వెల్లడించారు. తల వెనుక బలమైన గాయం కావడంతో బాధితురాలు మరణించినట్టు పోస్ట్మార్టం నివేదికలో తేలిందని చెప్పారు. మేఘావతి అత్త, భావ, భర్తలపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.