కురులను పొడిబారనివ్వకండి
జుట్టు పొడిబారడానికి కారణం మాడు ఎక్కువ తేమను కోల్పోవడం. అందుకని గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌ను మాడుకు పట్టించి, మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి పెరుగును మాడుకు పట్టించి, తర్వాత శుభ్రపరుచుకోవాలి. పెరుగు శిరోజాలకు మంచి కండిషనర్‌గా ఉపయోగపడుతుంది.
బాదంనూనెలో విటమిన్ ‘ఇ’ ఉండటం వల్ల మాడు త్వరగా పొడిబారదు. అందుకని బాదంనూనెతో మాడుకు మసాజ్ చేసుకోవచ్చు. మృదుత్వం కోసం కండిషనర్‌ని వాడేవారు మాడుకు తగలకుండా జాగ్రత్తపడాలి. అలాగే వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో మాడుకు తగిలేలా దువ్వాలి. దీని వల్ల రక్తప్రసరణ మెరుగై శిరోజాల కండిషనింగ్ బాగుంటుంది.
సుమ కోమలం
టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల బాదంపప్పు పొడి, 3 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టిస్తూ, మెల్లగా రబ్ చేస్తూ రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వారానికి ఒక్కసారైనా ఇలా చేడయం వల్ల చర్మానికి పువ్వులాంటి మృదుత్వం లభిస్తుంది.
మరింత ఎర్రగా...మెహెందీ!
నిమ్మరసంలో చక్కెర కలిపి, వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు దూది ముంచి మెహెందీ డిజైన్ పెట్టిన చేతులపై అద్దాలి. ఆరిన తర్వాత మరోసారి ఇలాగే చేయాలి. మెహెందీ పెట్టిన 24 గంటల తర్వాత డిజైన్ మరింత ఎరుపుదనం నింపుకుంటుంది.