ముక్కుపెద్దన
తిక్క లెక్క
అష్ట దిగ్గజాల్లో ముక్కు తిమ్మన బిరుదు ఉన్నది నంది తిమ్మనకు కదా అనుకుంటున్నారా..? ఔను... నిజమే! అల్లసాని పెద్దనకు ముక్కు పెద్దన అనే బిరుదేమీ లేదు. ముక్కు గురించి, ముక్కందం గురించి ముచ్చటైన పద్యాలు అల్లినందుకు నంది తిమ్మనకే ముక్కు తిమ్మన అనే బిరుదు దఖలు పడింది. అయితే, ఈ ఫొటోలోని టర్కీ పెద్దన్న అసలు పేరు మెహ్మెత్ ఓజ్యురెక్.
ఆయన ముక్కు పొడవును చూసిన వాళ్లెవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే! ఎందుకంటే, సాక్షాత్తూ గిన్నిస్ బుక్ రికార్డుల నిర్వాహకులే ప్రపంచంలోకెల్లా ముక్కుపెద్దన ఈయననేనంటూ బేషరతుగా సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఎందుకంటే ఈయనగారి ముక్కు పొడవు ఏకంగా 8.8 సెంటీమీటర్లు ఉంది మరి.