'కేజీ నుంచి రీయింబర్స్మెంట్ ఇవ్వాలి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రస్తుత తరుణంలోనైనా కేజీ నుంచి పీజీ వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపజేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, మెడికల్ డిగ్రీ స్థాయిలో ఇస్తున్న రీయింబర్స్‌మెంట్‌ను ప్రాథమిక విద్యలో ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కేజీ నుండి పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ సాధన కమిటీ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రీయింబర్స్మెంట్ సాధన కమిటీ చైర్మన్ బత్తుల సిద్దేశ్వర్, ప్రోఫెసర్ కంచె ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.