దయలేని వైద్య సిబ్బంది!
తిరుపతి: రుయా వైద్య సిబ్బంది తమకు దయలేదని రుజువు చేసుకున్నారు. ఓ వృద్ధరాలి పట్ల దారుణంగా ప్రవర్తించారు. జయమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రూయా ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పట్టించుకున్నవారు లేరు.
ఆమెకు వైద్య చేయకపోగా, వైద్య సిబ్బంది ఈ రోజు ఆమెను బయటకు గెంటివేసింది. ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద ఆమె దయనీయ స్థితిలో పడి ఉంది.