9 శాతం అదనపు వాటా
విక్రయించనున్న వొడాఫోన్
న్యూఢిల్లీ: వొడాఫోన్ కంపెనీ 9.5 శాతం అదనపు వాటాను ఆదిత్య బిర్లా గ్రూప్‌కు విక్రయించనుంది. ఒక్కో షేర్ రూ.130 చొప్పున ఈ అదనపు వాటాను వొడాఫోన్ విక్రయిస్తోంది.
వొడాఫోన్తో కుదిరిన విలీన స్కీమ్ ఒప్పంద వివరాలను ఆదిత్య బిర్లా గ్రూప్ బీఎస్ఈకి నివేదించింది. కాగా ఐడియా సెల్యులర్, వొడాఫోన్ కంపెనీల విలీనం కారణంగా దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీ అవతరిస్తోంది. 40 కోట్ల వినియోగదారులతో, 35 శాతం మార్కెట్ వాటాతో ఈ కంపెనీ అగ్రస్థానంలో నిలవనున్నది. ఈ డీల్ కారణంగా వొడాఫోన్ ఇండియా విలువ రూ.82,800 కోట్లుగానూ, ఐడియా సెల్యులర్ విలువ రూ.72,200 కోట్లుగానూ అంచనా వేశారు.