ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం..
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు
మేసా ఆనంద్ విజయకుమార్
రైలుపేట, గుంటూరు : రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నవ్యాంధ్ర మాలమహానాడు పోరాటం చేస్తుందని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మేసా ఆనంద్‌విజయకుమార్ తెలిపారు. బుధవారం గుంటూరు రాజీవ్‌గాంధీ నగర్‌లోని మాలమహానాడు కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేమళ్ళ చినకోటయ్య అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పును గౌరవించాలని కోరారు. రానున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మాలలను అధిక సంఖ్యలో కార్పొరేటర్లుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత నగర కమిటీపై ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాకింది జోసఫ్, ప్రచార కార్యదర్శి పెరికల రవిప్రకాష్, దాసరి మల్లికార్జునరావు, థామస్, శ్యామ్ ప్రసాద్, రేమళ్ళ ఏసుమధు, బడుగు నారాయణ, బుద్ధారవికుమార్, బోరుగడ్డ సునిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.