మెట్పల్లిలో చెరకు రైతుల భారీ ధర్నా
మెట్పల్లి: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని మూతబడిన చెరకు కర్మాగారాన్ని వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ మెట్పల్లిలో భారీ ధర్నా జరిగింది. మెట్పల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం ముత్యంపేట నుంచి మెట్పల్లి వరకు పాదయాత్రగా తరలివచ్చి పట్టణంలోని చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఈ సీజన్లో చెరకు క్రషింగ్‌ను ముత్యంపేట కర్మాగారంలోనే చేపట్టాలని ఆందోళనకు దిగిన రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, కొమ్‌రెడ్డి రాములు మద్దతు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.