ఎంజీబీఎస్ ప్రయాణికులే టార్గెట్
అఫ్జల్‌గంజ్: మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను మోసగిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను అఫ్జల్‌గంజ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. పాతబస్తీకి చెందిన సయ్యద్ ఇమ్రాన్, సయ్యద్ ఇజాజ్, సయ్యద్ ఇబ్రాహీం, మహ్మద్ రిజ్వాన్‌లు ముఠాగా ఏర్పడి ఎంజీబీఎస్‌లో ప్రయాణికులను పథకం ప్రకారం తమ ఆటోలో ఎక్కించుకుంటారు. కొంత దూరం వెళ్లాక ఆటో చెడిపోయిందని వారిని కిందికి దింపి, బాగుచేస్తున్నట్లు నటిస్తారు.
అదే అదనుగా ఆటోలోని ప్రయాణికుల బ్యాగుల్లో సెల్ఫోన్లు తదితరాలు, నగదును ఉంటే దొంగిలిస్తుంటారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఉదయం కాపువేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించగా నేరాలు వెల్లడయ్యాయి. వారి వద్ద ఉన్న రెండు ఆటోలను సీజ్ చేసి రూ.2.10 లక్షల విలువైన వస్తువులను, 4సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.