డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన విస్తారా
ముంబై: ప్రముఖ ఎయిర్‌లెన్స్ విస్తారా కూడా తగ్గింపు ధరలను ప్రకటించింది. 'మిడ్-సమ్మర్' సేల్ పేరుతో మంగళవారం డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన మార్గాలలో అతి తక్కువ ధరను రూ. 999లుగా నిర్ణయించింది. ఈ ఆఫర్లో బుకింగ్స్ బుధవారం ప్రారంభమై మే 20న ముగియనున్నాయి. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా 2017, జూన్ 12 నుంచి ఫిబ్రవరి 20, 2018 మధ్య ప్రయాణించేందుకు అవకాశం. జమ్మూ-శ్రీనగర్, గువహతి-బాగ్డోగ్ర మార్గాల్లో విమాన టికెట్‌ను రూ.999 లకే అందిస్తున్నట్టు విస్టా ప్రకటించింది.
ఢిల్లీ-చండీగఢ్ రూ .1499 ఢిల్లీ-లక్నో రూ .1,549, ఢిల్లీ-అమృతసర్ రూ.1699 లుగా వెల్లడించింది . అయితే, ఆఫర్ కింద కేటాయించిన సీట్ల సంఖ్యను మాత్రం బహిర్గతం చేయలేదు. ఈ ధరలో ఎకానమిక్ క్లాస్‌లో మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది.అలాగే ప్రీమియం ఎకానమీలో రూ.2,000 ఆఫర్‌ను వాడుకోచ్చవని తెలిపింది. అలా ఏఈ రాయితీ ఛార్జీలు తిరిగి చెల్లించబడవని, గ్రూప్, ఇన్ఫాంట్ బుకింగ్‌లకు వర్తించవని ఎయిర్‌లైన్స్ తన వెబ్ సైట్ లో పేర్కొంది.
కాగా దేశీయ విమానయాన సంస్థలు వరుసగా డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎంపిక చేసిన మార్గాల్లో, నిర్ణీత కాలానికి గాను, గో ఎయిర్, స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఏసియా బడ్జెట్ ధరల్లో టికెట్లను అందిస్తున్న సంగతి తెలిసిందే.
A midsummer flight’s dream! Book at fares starting ₹999 all-in for travel between 12th Jun’17 – 20th Feb’18 https://t.co/9epGF2s6fx pic.twitter.com/qSAxTqjHjE
— Vistara (@airvistara) May 16, 2017