గడ్డం చెప్పే ఏబీసీడీలు..
మీసాలపై నిమ్మకాయలు నిలబెట్టేవారు కొందరైతే.. మరికొందరు ఇలాంటోళ్లు. ఇతడి పేరు మైక్ అలెన్. న్యూయార్క్‌కు చెందిన డిజైనర్. స్నేహితులతో మైక్ వేసిన పందెం.. చివరికి అతడి మీసం, గడ్డంపై ఏబీసీడీలు మొలవడానికి దారి తీసింది. పిల్లలు పది నిమిషాల్లో ఏ నుంచి జెడ్ వరకూ రాసేస్తే.. ఇతనికి మాత్రం అందుకు రెండేళ్లు పట్టింది. ముందు ‘ఏ’ షేపులో గడ్డం, మీసాన్ని కత్తిరించుకోవడం.. అది పూర్తిగా వచ్చాక.. మళ్లీ మీసం, గడ్డం గీసేసుకుని.. తర్వాత ‘బీ’ను డిజైన్ చేసుకోవడం ఇలా చేస్తూ పోయాడు. దీంతో 2011లో ‘ఏ’తో మొదలుపెట్టిన మైక్.. 2013 డిసెంబర్ చివరినాటికి జెడ్‌కు చేరాడు.