Milk poured
-
ప్లీజ్.. అలాంటివి చేయొద్దు: లారెన్స్
చెన్నై: అభిమానుల అత్యుత్సాహంపై నృత్య దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కలత చెందారు. తన కోసం ఎటువంటి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాంచన 3 సినిమా విడుదల సందర్భంగా అభిమానులు లారెన్స్ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఓ అభిమాని ఏకంగా హుక్కులతో క్రేన్‌కు వేళాడుతూ లారెన్స్ కటౌట్‌కు పూలదండ వేసి, పాలతో అభిషేకించాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసి లారెన్స్ స్పందించారు. తన కోసం ఇలాంటి రిస్క్‌లు చేయొద్దని అభిమానులను కోరారు. తనపై అభిమానాన్ని చూపడానికి సాహసాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటివి చేసే ముందు అభిమానులు తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలని హితవు పలికారు. ‘నా మీద మీకున్న ప్రేమను చూపాలనుకుంటే స్కూల్ ఫీజు, పుస్తకాలు అవసరమైన పిల్లలకు సహాయం చేయండి. చాలా మంది వృద్ధులు అన్నం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి సాయపడండి. ఇలాంటివి చేస్తే నేనెంతో ఆనందిస్తాను, గర్వపడతాను. అంతేకాని మీ జీవితాన్ని ప్రమాదంలో పడేసే సాహస కార్యాలను ప్రోత్సహించను. మీ ప్రాణాలు ఎంతో విలువైనవని గుర్తించండి. దయచేసి మరోసారి ఇలాంటి సాహసాలు చేయొద్ద’ని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. View this post on Instagram Fans Extreme Devotion For #Lawrence During #Kanchana3 FDFS Celebrations ! #Kanchana3 Fever & More Expectations For Next Part ! #BlockBusterKanchana3 ! . . Follow @thecinebytes A post shared by Cinema_StaLL (@cinemastall) on Apr 21, 2019 at 1:07am PDT -
తెలంగాణ స్పీకర్‌కు పాలాభిషేకం.. వైరల్
సాక్షి, భూపాలపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్లకు, ఫొటోలకు ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు అప్పుడప్పుడు పాలాభిషేకాలు చేయడం చూశాం. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారికి ఆయన అభిమానులు పాలాభిషేకం చేశారు. ఆయనను మధ్యలో కూర్చోబెట్టి.. నిండు బిందె పాలతో ఆయనను తడిపేశారు. పెద్దపల్లి జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా పెద్దపల్లిలో స్పీకర్ మధుసూదనాచారికి ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయనను మొదట శాలువతో సత్కరించారు. అనంతరం తమ అభిమానం చాటుకుంటూ.. ఒక బిందె పాలను ఆయనపై గుమ్మరించారు. ఈ పాలాభిషేకంతో స్పీకర్ తడిసిముద్దయ్యారు. తమ గ్రామంలో కొత్త గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభమైన ఆనందంలో అభిమానులు స్పీకర్‌కు పాలాభిషేకం చేసినట్టు తెలుస్తోంది. ఈ పాలాభిషేకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. -
స్పీకర్‌కు పాలాభిషేకం... వైరల్!
-
సోనియాగాంధీ ఫ్లెక్సీకి పాలాభిషేకం
సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్ : పది జిల్లాల తెలంగాణకు కేబినెట్ మద్దతు తెలపడంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు శుక్రవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్లో సోనియా ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యదర్శి గంప మహేందర్ మాట్లాడుతూ సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం పది జిల్లాల తెలంగాణ ప్రకటించారని ఆమెను కొనియాడారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడతారని దీమా వ్యక్తం చేశారు. ఏఎంసీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన సోనియా, రాహుల్, దామోదర్ రాజనర్సింహాలకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. సిద్దిపేటలో గ్రూపు రాజకీయాలకు తెరదించి అందరినీ కలుపుకు పోవాలని పిలుపునిచ్చారు. గతంలో బల్దియాను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బల్దియా కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎల్పీ వర్మ, మార్క మహేష్, రసూల్ బాబా, ఎండీ ఖలీల్, సత్యంగౌడ్, రాజనరేందర్, అత్తు, సాకి అనంద్, దాస అంజయ్య, మార్క సతీష్, స్వరూప, రమాదేవి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.