సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్ : పది జిల్లాల తెలంగాణకు కేబినెట్ మద్దతు తెలపడంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు శుక్రవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లో సోనియా ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యదర్శి గంప మహేందర్ మాట్లాడుతూ సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం పది జిల్లాల తెలంగాణ ప్రకటించారని ఆమెను కొనియాడారు.
తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడతారని దీమా వ్యక్తం చేశారు. ఏఎంసీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన సోనియా, రాహుల్, దామోదర్ రాజనర్సింహాలకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. సిద్దిపేటలో గ్రూపు రాజకీయాలకు తెరదించి అందరినీ కలుపుకు పోవాలని పిలుపునిచ్చారు. గతంలో బల్దియాను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బల్దియా కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎల్‌పీ వర్మ, మార్క మహేష్, రసూల్ బాబా, ఎండీ ఖలీల్, సత్యంగౌడ్, రాజనరేందర్, అత్తు, సాకి అనంద్, దాస అంజయ్య, మార్క సతీష్, స్వరూప, రమాదేవి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
సోనియాగాంధీ ఫ్లెక్సీకి పాలాభిషేకం
Published Sat, Dec 7 2013 12:22 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement