మహేశ్వరం: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకే దక్కిందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సీమాంధ్రులు తెలంగాణ రాకుండా అడ్డుకున్నా చివరికి న్యాయమే గెలిచిం దని ఆయన పేర్కొన్నారు. గురువారం మండలంలోని రావిర్యాల గేటు శ్రీశైలం రహదారి సమీపంలోని ద్రాక్ష రైతుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి నాయినికి, స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి అభినందన, సన్మాన సభ నిర్వహిం చారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుందని ఉద్ఘాటిం చారు. రైతులకు లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేరు స్తుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెల కొన్న విద్యుత్ సమస్యను రెండేళ్లలో పరిష్కరిస్తామని చెప్పారు. మహేశ్వరంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. ద్రాక్ష పం టల రైతులకు సబ్సిడీ రుణాలు అంది స్తామ్డన్నారు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాను గ్రేప్ హబ్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. అంతకు ముందు జిల్లా ద్రాక్ష రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆర్‌సీఐ డెరైక్టర్ జి.సతీష్‌రెడ్డి, అఫెడ డెరైక్టర్ బోధ మాధవరెడ్డి, ద్రాక్ష రైతుల సంఘం అధ్యక్షుడు రామ్మోహన్‌రావు, కందుకూరు, సరూర్‌నగర్ జెడ్పీటీసీ సభ్యులు ఎనుగు జంగారెడ్డి, జిల్లెల నరేందర్‌రెడ్డి, ద్రాక్ష రైతుల సంఘం నాయకులు సుదర్శన్‌రెడ్డి, అనిల్‌కుమార్, నర్సయ్య, పెద్దిరాజు, భగీరథ్‌సింగ్, సుధాకర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ద్రాక్ష రత్న అవార్డు గ్రహీత వెంకట్‌రెడ్డి, రత్నం గుప్తా, సోహైల్ పాల్గొన్నారు.
తెలంగాణ ఘనత సోనియాదే
Published Fri, Aug 8 2014 12:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement