కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కోదాడఅర్బన్: రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం గోదావరి నదిపై ఆనకట్టలు నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక ఒప్పందం చేసుకోవడం హర్షణీయమని డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని 29వ వార్డులో జరిగిన కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం మంత్రి హరీష్‌రావు, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు కృషి చేస్తున్నారన్నారు. సాగర్ ఎడమకాలువ పరిధిలో చెరువులు నింపేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో నీళ్లు విడుదల చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు కుక్కడపు బాబు, నాయకులు రాయపూడి వెంకటనారాయణ, అంబyì కర్ర శ్రీనివాసరావు, చలిగంటి లక్ష్మణ్, బెలిదె అశోక్, కొక్కు లక్ష్మీనారాయణ, నెమ్మాది భాస్కర్, అంబడికర్ర వెంకన్న, మామిడి రామారావు, ఎక్బాల్, సుచిత్రాచారి, వంశీ శ్రీను, ఉప్పతల శ్రీను, మారుతీ శ్రీను, నాగరాజు, మధు తదితరులు పాల్గొన్నారు.