mingle
-
భార్యభర్తలు కలిసి ఆన్లైన్ చాటింగ్‌తో
భాగ్యనగర్‌కాలనీ: మింగిల్ ఆన్లైన్ ద్వారా చాటింగ్ చేస్తూ ఓ వ్యక్తిని లోబర్చుకుని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్న భార్యభర్తలపై కేసు నమోదైన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సిఐ కుషాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న కె.రమాకాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మింగిల్ ఆన్లైన్ వెబ్ సైట్ ద్వారా కవిత అలియాస్ స్వాతితో పరిచయం ఏర్పడింది. దీంతో రోజూ చాటింగ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. అయితే కవిత అలియాస్ స్వాతి తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, నాలుగు లక్షల రూపాయలు అవసరముందని రమాకాంత్‌ను వేడుకుంది. దీంతో రమాకాంత్ తన వద్ద అంత డబ్బు లేదని ఈ నెల 9వ తేదీన 5 వేల రూపాయలు నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. తిరిగి మళ్లీ అడగడంతో 14వ తేదీన మరో 10 వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయగా ఇంతటితో ఆగకుండా అతని వద్ద నుంచి ఎలాగైనా డబ్బులు లాగాలని పథకం వేసిన భార్యభర్తలు సతీష్, స్వాతి చాటింగ్‌లో లక్ష రూపాయలు కావాలని మరోసారి అతనిని వేడుకున్నారు. దీంతో తాను ఇవ్వలేనంటూ తేల్చి చెప్పడంతో ఆన్లైన్ మెసేజ్‌ల ద్వారా అతడిని ప్రేమలోకి దించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే సెల్ ఫోన్ ద్వారా ఒకరికొకరు మెసేజ్‌లు పంపుకున్నారు. ఇంతటితో ఆగకుండా స్వాతి బాండ్ పేపర్లు తీసుకుని మీ ఇంటికి వస్తానని లక్ష రూపాయలు అప్పుగా ఇవ్వాలని కోరింది. దీంతో అతడు నిరాకరించాడు. అయితే స్వాతి తన భర్తతో డబ్బులు ఇవ్వాలని రమాకాంత్‌తో ఫోన్లో మాట్లాడించింది. దీంతో రమాకాంత్ తాను ఇవ్వలేనని చెప్పడంతో చాటింగ్ ద్వారా మరింత ఒత్తిడి తీసుకువచ్చింది. సెల్ఫోన్లో వారు ఇద్దరు మాట్లాడుకున్న మెసేజ్‌లను భర్త సతీష్ రమాకాంత్ ఇంటికి వెళ్లి తనకు డబ్బులు ఇవ్వాలని లేదంటే మెసేజ్‌లు బయటపెడితే ఇబ్బందికరంగా ఉంటుందని బెదిరించటమే కాకుండా 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో వారి నుంచి వేధింపులు తాళలేక రమాకాంత్ కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాధ్యత... భరోసా
సామాజిక సేవలో పోలీసులు జనమైత్రి ద్వారా జనంతో మమేకం జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చెన్నూర్ : ఖాకీ చొక్కా తొడిగి ధర్మాన్ని కాపాడుతారు. లాఠీ పట్టి నేరస్తుల బెండు తీస్తారు. తలపై ధరించిన టోపీలోని సింహాల్లా సమాజంలోని మానవ మృగాల బారి నుంచి సామాన్యులను రక్షిస్తారు. 24 గంటలు 7 రోజులు 365 రోజులు శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమవుతారు. సమాజాన్ని డేగ కన్నులతో పహారా కాస్తారు. పీ ఫర్ పోలీస్... పోలీస్ ఫర్ పబ్లిక్.. జనంతో మమేకమవుతున్న పోలీసులపై ఈ కథనం. ప్రజల సేవలో మేము సైతం అంటూ ‘జనమైత్రి’ పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నిన్న మొన్నటి వరకు పోలీసులు మీకోసం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. పోలీసులు మీలో ఒకరేననే కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. పోలీసులు శాంతి భద్రతలతో పాటు సామాజిక సేవకులని చాటి చెప్పేందుకు నేడు జనమైత్రి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామానికో జనమైత్రి పోలీసు అధికారిని నియమించారు. ఆయా గ్రామాల్లో జనమైత్రి గ్రామసభలు నిర్వహించి ప్రజలను అన్ని రకాలుగా చైతన్యం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దిశగా పయనించాలని ప్రజలకు మార్గ నిర్దేశం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం సత్వరమే గ్రామాలలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలు జనమైత్రి పోలీసు అధికారి దృష్టికి తీసుకొని వస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. గ్రామ అభివద్ధికి ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నప్పటికీ ఇతర అభివృద్ధి పనుల్లో జనమైత్రి పోలీసు అధికారులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. యువతకు ప్రోత్సాహం గ్రామాలలోని నిరుద్యోగ యువతపై జనమైత్రి పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అన్ని ఉండి అవకాశాలు లేక నిరుత్సాహంలో ఉన్న యువతను ప్రోత్సహిస్తున్నారు. వారి లోని ప్రతిభను వెలికితీసేందుకు పలు పోటీలను నిర్వహిస్తున్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని గ్రామస్తులను కోరుతున్నారు. గుడుంబా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గ్రామాల్లో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారు.