mini bus collided
-
విషాదం : ఎద్దును తప్పించబోయి..
జైపూర్ : రాజస్తాన్‌లోని నాగౌర్ జిల్లాలో శనివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. హైవేపై వెళ్తున్న మినీ బస్సుకు ఎదురుగా వచ్చిన ఎద్దును తప్పించబోయి చెట్టును బలంగా డీకొట్టడంతో 12 మంది మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని లాతూర్ నుంచి హర్యానాలోని హిసార్‌కు వెళ్లేందుకు శుక్రవారం మద్యాహ్నం మినీ బస్సులో 22మంది బయలుదేరారు. ఈ నేపథ్యంలో మినీ బస్సు నాగౌర్ జిల్లాలోని కచ్‌మన్ జాతీయ రహదారి వద్దకు రాగానే ఒక ఎద్దు ఎదురుగా వచ్చింది. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ఎద్దును తప్పించడానికి సడెన్ బ్రేక్ వేశాడు. కానీ అప్పటికే బస్సు ఓవర్‌స్పీడ్ ఉండడంతో అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌తో సహ 12 మంది మృతి చెందగా వారిలో ఆరుగురు మహిళలున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని స్ధానికుల సాయంతో మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టంకు తరలించారు. కాగా మిగతా 10 మందిలో తీవ్రంగా గాయపడిన నలుగురిని జైపూర్‌లోని ఎస్‌మ్మెఎస్ ఆసుపత్రికి తరలించగా, మిగతావారిని నాగౌర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
‘అనంత’ విషాదం
తనకల్లు/ నల్లచెరువు: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 42వ జాతీయ రహదారి నెత్తురోడింది. మినీ బస్సును లారీఢీకొట్టడంతో.. ఏడుగురు దుర్మరణం చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తనకల్లు– నల్లచెరువు మండలాల సరిహద్దు ప్రాంతమైన ఎర్రగుంటపల్లి సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం 7 గంటలకు 20 మందికి పైగా ప్రయాణికులతో మినీ బస్సు తనకల్లు నుంచి కదిరికి బయలుదేరింది. అయితే ఎర్రగుంటపల్లి చెరువు మలుపు వద్దకు రాగానే అనంతపురం నుంచి మదనపల్లి వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి మినీ బస్సును బలంగా ఢీ కొంది. దీంతో మినీ బస్సు ముందుభాగం నుజ్జనుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో మినీ బస్సులో ఉన్న తనకల్లుకు చెందిన పండ్ల వ్యాపారి ఖాదర్‌బాషా (43), చిట్‌ఫండ్ ఉద్యోగి నగేష్ (32), భారతమ్మ (44), కాటేపల్లికి చెందిన మహబూబ్‌బాషా (55), ఎన్పీ కుంట మండలం యాదుళోళ్లపల్లి జయమ్మ (48) అక్కడికక్కడే మృతి చెందారు. మినీ బస్సు– లారీ మధ్యలో చిక్కుకున్న కాటేపల్లి మహబూబ్‌బాషా మృతదేహాన్ని స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఎన్పీకుంట మండలం యాదుళోళ్లపల్లికి చెందిన రామచంద్రారెడ్డి (58) కదిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మరో గుర్తు తెలియని వ్యక్తి (55) తనకల్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 10 మందిలో తనకల్లుకు చెందిన బాబ్జాన్, రాఘవేంద్ర, శ్రీనివాసులు, మస్తాన్‌వలి, రెడ్డిశేఖర్, మహబూబ్‌బాషా, శివ గంగాదేవి, గుంజువారిపల్లి దామోదర్, మించలివారికోట శ్రీనివాసులు, కొక్కంటి క్రాస్‌కు చెందిన తిరుపాల్ ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కదిరి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, రూరల్ సీఐ రెడ్డెప్ప, ఎస్ఐలు రంగడు, రమేష్‌బాబు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నల్లచెరువు పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు తనకల్లు మండలం వాసులు మండల కేంద్రమైన తనకల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురిలో నలుగురు తనకల్లుకు చెందినవారే ఉన్నారు. అలాగే తనకల్లుకే చెందిన మరో 10 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుండటంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆడబిడ్డలను చదివించాలని తనకల్లు స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో ఉండే ఖాదర్బాషాకు భార్య అమ్మజాన్తో పాటు నగీనా, హర్షియా సంతానం. ఖాదర్‌బాషా సైకిల్‌పై పండ్ల వ్యాపారం చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. శుక్రవారం కదిరిలో పండ్లు కొనుగోలు చేసేందుకు మినీ బస్సులో బయల్దేరాడు. అయితే రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇంటి పెద్దను కోల్పోయానని, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కావట్లేదని భార్య అమ్మజాన్ కన్నీటి పర్యంతమైంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్నమినీ బస్సు
ఒకరు మృతి,8 మందికి తీవ్రగాయాలు రాజమండ్రి పుష్కరాలకు వెళ్తుండగా ప్రమాదం పెనుబల్లి : ఆగి ఉన్న లారీని మినీబస్సు ఢీకొట్టడంతో మినీబస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతిచెందగా, మరో 8 మంది తీవ్ర గాయూలపాలైన సంఘటన పెనుబల్లి మండల పరిధిలోని లంకపల్లి-కొత్త లంకపల్లి గ్రామాల మధ్య మంగళవారం తెల్లవారుజామున జరిగింది. హైదరాబాద్ తార్నాక, రామంతపూర్, ఉప్పల్ ప్రాంతాలకు చెందిన 21 మంది హైదరాబాద్‌లోని మారుతి ట్రావెల్స్ నుంచి స్వరాజ్ మజ్డా మినీ బస్సులో రాజమండ్రి పుష్కరాలకు సోమవారం రాత్రి 7 గంటలకు బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు పెనుబల్లి మండల పరిధిలోని లంకపల్లి -కొత్త లంకపల్లి గ్రామాల మధ్య అప్పటికే రోడ్డు ప్రమాదానికి గురైన లారీని వెనుక నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. ప్రమాదాన్ని గమనించిన అటుగా వెళ్తున్న వాహనదారులు వియంబంజర్ ఎస్సై పి. నవీన్‌కు సమాచారమివ్వడంతో ఆయన తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను రక్షించేందుకు జేసీబీని ఉపయోగించి బస్సుకు తాళ్లుకట్టి 2 గంటల పాటు శ్రమించి లారీ నుంచి మినీ బస్సును వేరుచేసి డ్రైవర్ గుర్రాల నరసింహారావును ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ తార్నాకకు చెందిన చమంగళ లక్ష్మీనారాయణ(50), శివాల దిశాలు, బర్ల సుజాత, శివాల చిన్నమ్మ, బొంగోలు తరణికి తీవ్రగాయూలు కాగా గావర గోవిందరావు, బొంగోలు గున్నమ్మ, శివాల కావ్యకు గాయాలయ్యాయి. వారిని సత్తుపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో చమంగళ లక్ష్మీనారాయణ మృతిచెందాడు. ప్రమాదానికి గురైన వారంతా ఒరిస్సా రాష్ట్రం గజపతి జిల్లా పాతపట్నం మండలం వాసులని తెలిసింది. పరాలికవిండ గ్రామానికి చెందిన వారిగా, వీరంతా 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి, పంచనామా చేసి, పోస్టు మార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి. నవీన్ తెలిపారు. ఆటోను లారీ ఢీకొని మహిళ మృతి కొత్తగూడెం రూరల్ : ఆటోను లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందగా, చిన్నారికి తీవ్ర గాయూలైన సంఘటన కొత్తగూడెం పట్టణంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామవరంలోని నాగయ్యగడ్డకు చెందిన ముత్తెర భాగ్య(45), ముత్తెర రాజమ్మ, ఎస్ సమ్మయ్య, అతడి భార్య మదునమ్మ, యాకుబ్బీ, రూప్ బేగం, ఎమ్డీ పర్వీన్బీ సోమవారం ఉదయం పుష్కర స్నానాలకు వెళ్లారు. స్నానాలు ముగించుకుని ఆర్డీసీ బస్సు లో కొత్తగూడెం వచ్చారు. అనంతరం కొంగ నవీన్ ఆటోలో ఇంటికి వెళుతుండగా, సెయిం ట్ మేరీస్ స్కూల్ ముందున్న ఎస్బీహెచ్ బ్యాంకు వద్ద రామవరం నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడగా ముత్తెర భాగ్య, ఎమ్డీ పర్వీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించగా భాగ్య చికిత్స పొందుతూ మృతిచెందింది. చిన్నారి ఎమ్డీ పర్వీన్ గాయాలతో ఖమ్మం ఆస్పత్రిలో చిక్సిత పొందుతోంది. మిగతా వారికి గాయూలు కాగా స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చిక్సితపొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.