మినీ తిరుమలగా రాజమండ్రి
రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు కేంద్రస్థానమైన రాజమండ్రి పుష్కరాల సమయంలో మినీ తిరుమలగా భాసిల్లనుంది. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు దేశం నలమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం రాజమండ్రిలో నమూనా ఆలయాన్ని నిర్మించనుంది. 1979 నుంచి టీటీడీ ప్రతి పుష్కరానికీ ఇలా నమూనా ఆలయాన్ని నిర్మిస్తోంది. స్థానిక తాడితోట సమీపంలోని స్టేడియంలో నమూనా ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ, జిల్లా యంత్రాంగం నిర్ణయించారు.