Minister basvaraju SARAIAH
-
పోరాట ఫలితం.. తెలంగాణ
ఆత్మకూరు, న్యూస్‌లైన్ : ప్రత్యేక రాష్ట్రం కోసం యాభైఆరేళ్లుగా తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించిందని బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. ఆత్మకూరులో శనివారం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్గాల వెంకట్రాంరెడ్డి నేతృత్వంలో జరిగిన తెలంగాణ విజయోత్సవ ర్యాలీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఇచ్చిందన్నారు. సీమాంధ్రలో జరుగుతున్నది బూటకపు ఉద్యమమని పేర్కొన్నారు. కష్టసుఖాల్లో వెన్నంటి ఉండే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని కోరారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ విషయంలో స్పష్టతతోఉన్న బీజేపీకి లేనిబాధ సీమాంధ్రలో ఉన్న కాంగ్రెస్ గ్రూపునకు ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌ల జాగకోసమే సీమాంధ్రుల పోరాటమని, వారికి డబ్బు బలముంటే తమకు గొంతు బలముందని చెప్పారు. ఆంటోని కమిటీకి చెప్పడానికి సీమాంధ్రుల వద్ద ఏ స్టేట్మెంటూ లేదన్నారు. డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ 2014లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ సమ్మారావు మాట్లాడుతూ చంద్రబాబు సన్నాయి నొక్కులు ఆపాలని హితవు పలికారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి బక్క జడ్సన్, ఆత్మకూరు మార్కె కమిటీ చైర్మన్ పింగిలి వెంకటనర్సింహారెడ్డి,చిదిరాల సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, పైడి, సర్పంచ్ సామెల్, రాము, గౌతమ్, సారంగపాణి, సంపత్, శ్రీనివాస్, సతీష్‌కుమార్, అశోక్, జనార్దన్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరు అడ్డుపడ్డా తెలంగాణ ఆగదు వరంగల్ సిటీ : ఎవరు అడ్డుపడ్డా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు ఆగదు.. ఇటు సూర్యుడు అటు పొడిచినా సోనియా వెనుకంజ వేయరని మంత్రి బస్వరాజు సారయ్య ధీమా వ్యక్తం చేశారు. హన్మకొండలోని సర్క్యుట్ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతవాసులకు ఎవైనా సమస్యలుంటే అనుభవజ్ఞుడైన దిగ్విజయ్‌సింగ్‌కు చెప్పుకోవచ్చన్నారు. మీకేం కావాలో? మీ బాధలేంటో వివరించాలని కోరారు. సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. దీనిని సీఎం, పీసీసీ అధ్యక్షుడితో సహా అందరూ ఖండించాల్సిందేనన్నారు. అసాంఘిక శక్తులను అరికట్టాలని కోరారు. దేవుని దర్శనం కోసం వెళ్లిన వారిపై దాడులు చేయడం సిగ్గుచేట న్నారు. సమావేశంలో పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ సాంబారి సమ్మారావు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ను ఏ పార్టీ ఎదుర్కోలేదు
పరకాల, న్యూస్‌లైన్ : నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదని రాష్ర్ట బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. విద్యార్థుల బలిదానాలను అర్థం చేసుకున్న యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుపై సీడబ్ల్యూసీ చేసిన ప్రకటనను హర్షిస్తూ పరకాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబారి సమ్మారావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి బస్వరాజు సారయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. తెలంగాణ కోసం 56 ఏళ్ల నుంచి కొనసాగుతున్న పోరాటం సోనియా గాంధీతో నెరవేరిందని చెప్పారు. సీడబ్ల్యూసీలో ఏకవాక్య తీర్మాణంపై తెలంగాణ ప్రకటన చేయించిన ఘనత సోనియాకే దక్కుతుందన్నారు. తెలంగాణ ఉంటున్న సీమాంధ్రులను మన కుటుంబ సభ్యులేనని, రాష్ర్టం ఏర్పడిన తర్వాత వారిని అన్నదమ్ముల్లా చూడాలని ప్రజలకు సూచించారు. తెచ్చింది.. ఇచ్చింది.. కాంగ్రెస్సే : ఎంపీ సిరిసిల్ల రాజయ్య తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. తెచ్చింది.. కాంగ్రెస్ ప్రభుత్వమేనని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నాలుగుకోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకే సోనియాగాంధీ రాష్ర్ట ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమ ని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిందన్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌తో సహా తొమ్మిది జిల్లాల్లో నివాసముంటున్న సీమాంధ్రులకు, వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండి సారంగపా ణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మడికొండ సం పత్, నాయకులు బస్వోజు సురేష్, తిరుపతి రెడ్డి, కళావతి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
త్వరలోనే బీసీ సబ్‌ప్లాన్
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : త్వరలోనే బీసీ సబ్‌ప్లాన్ అమలుకానుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శని వారం బీసీ జనదిశ సదస్సు ప్రొఫెసర్ మురళీమనోహర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కేంద్ర మంత్రి బలరాంనాయక్, రాష్ట్ర మంత్రి సారయ్య, ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సారయ్య మాట్లాడారు. రాష్ట్రంలో మొదటిసారిగా మహా త్మా జ్యోతిరావుపూలే పేరుతో బీసీ మేనిఫెస్టో కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు కోసం కేంద్రానికి నోట్ తయారు చేసి పంపించామని వివరించారు. ముఖ్యమంత్రి సైతం బీసీ సబ్‌ప్లాన్‌పై చొరవ చూపారని, త్వరలోనే దేశవ్యాప్తంగా బీసీ సబ్‌ప్లాన్ అమలయ్యే అవకాశం ఉందని తెలిపారు. అధికశాతం శ్రమజీవులు, నాగరికత తెలిసినవారు, అందరితో కలిసిమెలిసి ఉండేవారు బీసీలేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం పార్టీలకతీతంగా అందరం ఒకటి కావాలని సూచించారు. అనంతరం ప్రొఫెసర్ మురళీమనోహర్ మాట్లాడారు. రాష్ట్రంలో 80 శాతం, దేశంలో 56 శాతం జనాభాలో బీసీలే ఉన్నారని వెల్లడించారు. బీసీలను ఏకం చేయడం కోసం త్వరలోనే జాతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సన్మానించారు. ప్రొఫెసర్లు రవీందర్, దామోదర్, మనోహర్‌రావు, టి.రమేష్, బీసీ నాయకులు గుండు ప్రభాకర్, బయ్య స్వామి, మీసాల ప్రకాష్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు దిడ్డి కుమారస్వామి, సాదుల దామోదర్, కటకం పెంటయ్య, చాంబర్ మాజీ అధ్యక్షుడు కంభంపాటి కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు మందా వినోద్‌కుమార్, గోరంటల రాజు, వేముల నాగరాజు, బస్వరాజు శ్రీమాన్, బస్వరాజు కుమార్, వస్కుల ఉదయ్‌కుమార్, కొమ్ము సుధాకర్, బాసాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నిరాశతో వెనుదిరిగిన ఉద్యోగ జేఏసీ నాయకులు.. కేంద్ర సామాజిక సహాయ మంత్రి బలరాం నాయక్‌ను సన్మానించడం కోసం జిల్లా ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు రాజేష్‌గౌడ్, నగర అధ్యక్షుడు గజ్జెల రామకృష్ణ తదితరులు చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయానికి విచ్చేశారు. కాగా ఈ లోపే మంత్రి బలరాంనాయక్ వేరే పనిమీద బయటకు వెళ్లడంతో ఉద్యోగులంతా నిరాశకు గురయ్యారు.