ఆలయంలో మంత్రి బొజ్జల భార్య హల్చల్
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భార్య బృందమ్మ హల్చల్ చేశారు. శనివారం ఆలయంలోని అన్ని విభాగాలను తనిఖీలు చేసిన బృందమ్మ, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సస్పెండ్ చేయిస్తానని ఆలయ అధికారులకు హెచ్చరికలు జారీచేశారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి, ఆలయ ఈవో రామ్రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగి 24 గంటలు గడవక ముందే మంత్రి భార్య తనిఖీలు అంటూ హల్చల్ చేయడం తీవ్ర దుమారమైంది. మహాశివరాత్రి ఉత్సవాల టెండర్ల వ్యవహారంలో రాధారెడ్డి, రామ్రెడ్డిల మధ్య శుక్రవారం నాడు విభేదాలు తలెత్తడంతో గొడవ జరిగిన విషయం తెలిసిందే.