Minister JP nadda
-
ఎయిమ్స్‌కు నిధులివ్వండి
కేంద్ర మంత్రికి బూర నర్సయ్యగౌడ్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఇక్కడ మంత్రిని కలసిన ఆయన వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మంత్రి సంబంధిత ఫైలును ఆర్థిక శాఖకు పంపామని, త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే భువనగిరి పరిధిలో రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఎంపీ బూర లేఖ రాశారు. -
‘నీట్’ బిల్లులకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: నీట్(జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష) ఆర్డినెన్సుల స్థానంలో తెచ్చిన రెండు బిల్లులను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. భారత వైద్య మండలి (సవరణ) బిల్లు-2016, దంతవైద్యుల (సవరణ) బిల్లు-2016లను సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా వీటి పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష వల్ల వైద్య విద్యార్థులకు బహుళ సంఖ్యలో ప్రవేశపరీక్షలు రాసే బాధ తప్పుతుందని, అలాగే, క్యాపిటేషన్ ఫీజు వంటి సమస్యలకు ఈ బిల్లులు అంతం పలుకుతుతాయని వాటిని సభలో ప్రవేశపెడ్తూ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. నీట్ వల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లబోదని స్పష్టం చేశారు. గ్రామీణ విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్షకు సిలబస్‌ను ప్రమాణీకరిస్తామన్నారు. ప్రాంతీయ బాషల్లోనూ నీట్‌ను నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ కోరింది. -
గతేడాది 361 మంది హెపటైటిస్-బి మృతులు
లోక్‌సభలో ఎంపీ పొంగులేటి పశ్నకు కేంద్ర మంత్రి సమాధానం న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా హెపటైటిస్-బి తో 2014లో 361 మంది మృత్యువాత పడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సమాచారం లేదన్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రబలుతున్న హెపటైటిస్-బి వ్యాధి అరికట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు తెలపాలంటూ శుక్రవారం లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఆయనతోపాటు టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు జేపీ నడ్డా శుక్రవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 12వ పంచవర్ష ప్రణాళికలోనూ వైరల్ హెపటైటిస్‌ను అరికట్టేందుకు ప్రణాళికలు రూపొం దించి అమలు చేస్తున్నామని, పలు జాతీయస్థాయి పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన మందులను ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు, ప్రైవేటు కంపెనీల నుంచి అంతర్జాతీయంగా టెండర్లు నిర్వహించి సేకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి నడ్డా తెలిపారు.