మధుమేహానికి ఆయుష్-82 ఔషధం
న్యూఢిల్లీ: మధుమేహ చికిత్స కోసం కేంద్ర ఆయుర్వేద శాస్త్రాల పరిశోధన మండలి(సీసీఆర్ఏఎస్) ఆయుష్-82 పేరుతో కొత్త ఔషధాన్ని తయారు చేసింది. పరీక్షల్లో సత్ఫలితాలు వచ్చాయని, రోగుల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గాయని ఆయుష్ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ శుక్రవారం లోక్‌సభకు తెలిపారు. ఐదు మొక్కలతో ఈ ఔషధాన్ని తయారు చేశారన్నారు.
చాక్లెట్‌తో డయాబెటిస్‌కు చెక్!
లండన్: రోజూ స్వల్ప మొత్తంలో చాక్లెట్లు తినే వారిలో ఇన్సులిన్ సామర్థ్యం పెరిగి, డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని బ్రిటన్‌లోని వార్విక్ వర్సిటీ అధ్యయనంలో తేలింది. రోజూ 100 గ్రాముల చాక్లెట్ తింటే ఇన్సులిన్ సామర్థ్యం పెరిగి, కాలేయం ఎంజైములు వృద్ధి చెందాయని పరిశోధకులు గుర్తించారు.